Accident: అద్దె ఇంట్లోకి రానివ్వని యజమాని.. రోడ్డుపైనే ముగ్గురి శవాలు!

inhumane incident in bhadrachalam

Accident: భద్రాచలంలో ఘోర ప్రమాదం: శవాలను అద్దె ఇంట్లోకి రానివ్వని యజమాని.. రోడ్డుపైనే ముగ్గురి మృతదేహాలు!

భద్రాచలంలో గుండెలను పిండేసే అత్యంత హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. రోడ్డు ప్రమాదం (Accident)లో ప్రాణాలు కోల్పోయిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతదేహాలను అద్దె ఇంట్లోకి తీసుకురావడానికి ఇంటి యజమాని నిరాకరించాడు. ఈ అమానుష చర్యపై మృతుల బంధువులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రమాదం ఎలా జరిగిందంటే?

భద్రాచలం (Bhadrachalam) లోని వెంకటేశ్వర కాలనీకి చెందిన దూడల సాయిప్రకాశ్ (25), సంధ్య (22) దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల హైదరాబాద్ నుంచి ములకలపల్లి గ్రామానికి వచ్చిన బంధువులను కలవడానికి సాయిప్రకాశ్ తన భార్య సంధ్య, చిన్న కుమారుడు మోక్షిత్ (2), తల్లి జ్యోతితో కలిసి కారులో వెళ్లారు.

Also Read: Trending: క్రేజీ ఐడియా: ట్రాక్టర్ ట్రాలీని స్విమ్మింగ్ పూల్ చేశాడు

భద్రాచలం ఘటన: అమానుషంగా ప్రవర్తించిన ఇంటి యజమాని

ఆదివారం తిరుగుప్రయాణంలో మాధారం(Madharam) అటవీ ప్రాంతంలో కారు అదుపుతప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది (Accident). ఈ ఘోర ప్రమాదంలో సాయిప్రకాశ్, సంధ్య, చిన్నారి మోక్షిత్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన తల్లి జ్యోతి ప్రస్తుతం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

భద్రాచలం ఘటన: అమానుషంగా ప్రవర్తించిన ఇంటి యజమాని

పాల్వంచలో పోస్టుమార్టం (Post Mortum) పూర్తి చేసిన అనంతరం, సోమవారం బంధువులు మృతదేహాలను భద్రాచలంలోని వారి అద్దె ఇంటికి తీసుకువచ్చారు. అయితే అప్పటికే ఇల్లు తాళం వేసి ఉండటంతో యజమానికి ఫోన్ చేశారు. మృతదేహాలను ఇంట్లోకి తీసుకురావడానికి యజమాని సచ్చినా ఒప్పుకోలేదని స్థానికులు మండిపడ్డారు.

Also Read: Crime: స్నానం చేయలేదని తల్లి మందలించిందనీ.. బావిలోకి దూకిన బాలిక!

యజమాని భయానికి కారణం ఇదేనా?

సాయిప్రకాశ్ తండ్రి శ్రీనివాస్ (విద్యుత్ శాఖ లైన్ ఇన్‌స్పెక్టర్) కూడా ఆరు నెలల క్రితమే గుండెపోటుతో మరణించారు. ఇప్పుడు ఒకే కుటుంబంలో మరో ముగ్గురు చనిపోవడంతో, దీనిని ‘అరిష్టం’గా భావించి.. భవిష్యత్తులో ఆ ఇంటికి ఎవరూ అద్దెకు రారనే స్వార్థంతోనే యజమాని ఇలా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.

భద్రాచలం ఘటన: అమానుషంగా ప్రవర్తించిన ఇంటి యజమాని

యజమాని నిరాకరించడంతో చేసేదేమీ లేక, బంధువులు తీవ్ర ఆవేదనతో మృతదేహాలను అదే అంబులెన్స్‌లో పురుషోత్తపట్నానికి తరలించి అక్కడ అంత్యక్రియలు(Funeral)  నిర్వహించారు. మానవత్వాన్ని (Humanity) మరుగనపడేసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Also Read: Crime: అరుణాచలంలో యువతులను నగ్నంగా వీడియోలు తీసి.. SMలో షేర్ చేస్తామని..