Jio AirFiber vs Airtel Xstream AirFiber: ఒకప్పుడు సినిమా చూడాలంటే కచ్చితంగా థియేటర్ కు వెళ్లాల్సిందే. టీవీలో చూడాలంటే నెలలు వెయిట్ చేయాల్సిందే. కానీ స్మార్ట్ టీవీలు, OTTలు వచ్చాక అంతా మారిపోయింది. ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ఫ్యామిలీ మొత్తంతో కలిసి మూవీ చూస్తున్నారు. అలా వీటి వాడకం రోజురోజుకూ పెరుగుతోంది. దీని వల్ల ఇంట్లో హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరిగా మారింది. వైర్లు లేకుండా నేరుగా వైఫై ఇచ్చే ‘ఎయిర్ ఫైబర్’ (AirFiber) సాంకేతికతకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ రెండూ ఎయిర్ ఫైబర్ రంగంలో పోటీపడుతున్నాయి. మరి వీటిలో తక్కువ ధరలో ఎక్కువ OTT సబ్స్క్రిప్షన్లు ఇచ్చే ప్లాన్ ఏది?
జియో ఎయిర్ ఫైబర్ (Jio AirFiber) ప్లాన్లు & ప్రయోజనాలు
జియో ప్రాథమికంగా రూ.599 ప్లాన్‌తో ఎయిర్ ఫైబర్ సేవలను అందిస్తోంది.
-
నెలకు ధర: ₹599 + జీఎస్టీ (GST)
-
స్పీడ్: 30 Mbps
-
డేటా: అన్లిమిటెడ్ (3300 GB)
-
ఉచిత OTTలు: డిస్నీ+ హాట్‌స్టార్, జీ5, సోనీ లివ్, జియోసినిమా ప్రీమియంతో పాటు మొత్తం 800+ టీవీ ఛానెల్స్, 13+ OTT యాప్స్ ఉచితం.
-
ప్రత్యేకత: 100 Mbps వేగంతో కావాలనుకుంటే రూ.899 ప్లాన్ అందుబాటులో ఉంది. ఇందులో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో వంటి అదనపు యాప్స్ లభిస్తాయి.
ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఎయిర్ ఫైబర్ (Airtel Xstream AirFiber)
ఎయిర్టెల్ కంపెనీ వైఫై 6 టెక్నాలజీతో మెరుగైన కవరేజ్ ఇస్తున్నట్లు పేర్కొంటోంది.
-
నెలకు ధర: రూ.699 + జీఎస్టీ (GST)
-
స్పీడ్: 40 Mbps
-
డేటా: అన్లిమిటెడ్
-
ఉచిత OTTలు: డిస్నీ+ హాట్‌స్టార్, ఆహా, జీ5, ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ద్వారా 350+ లైవ్ టీవీ ఛానెల్స్, 20+ OTT యాప్స్.
-
ప్రత్యేకత: 100 Mbps స్పీడ్ కావాలనుకుంటే రూ.799, ₹899 ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.
Jio vs Airtel: రెండింటిలో ఏది బెటర్?
| ఫీచర్ | జియో ఎయిర్ ఫైబర్ | ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ |
| ప్రారంభ ధర | రూ.599 + GST | రూ.699 + GST |
| బేసిక్ స్పీడ్ | 30 Mbps | 40 Mbps |
| లైవ్ టీవీ ఛానెల్స్ | 800+ | 350+ |
| ఉచిత సెట్ టాప్ బాక్స్ | అవును | అవును |
ఫైనల్ గా చెప్పాలంటే..
మీకు తక్కువ బడ్జెట్లో ఎక్కువ OTT యాప్స్, ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్స్ కావాలంటే జియో ఎయిర్ ఫైబర్ (రూ.599) బెస్ట్ ఆప్షన్. ఒకవేళ ఇంటర్నెట్ స్పీడ్ మరియు గేమింగ్ ప్రాధాన్యత అయితే 40 Mbps వేగంతో వచ్చే ఎయిర్టెల్ (రూ.699) సరిపోతుంది. మరి మీరు దేన్ని ఎంచుకున్నారు..?
Also Read: Snake Revenge: పాములు పగబడతాయా.. తోటి పామును చంపారని ఇద్దరు పిల్లలపై..
