Skip to content
Friday, Oct 02, 2026
  • Home
  • Telugu States
  • National
  • Cinema
  • Business
  • Tech
  • Jobs
  • Life Style
  • Gallery
Telugupost | Telugu Latest News

Telugupost | Telugu Latest News

Advertisment Image
Tech

Whatspp: మొబైల్ లో సిమ్ లేదా.. ఐతే వాట్సాప్ పనిచేయదు

adminFebruary 28 2:32 pm
SIM binding rules, WhatsApp login, government deadline, cyber fraud, messaging apps, mobile security, India news, tech update

SIM binding rules, WhatsApp login, government deadline, cyber fraud, messaging apps, mobile security, India news, tech update

Whatspp: మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 28 తర్వాత సిమ్ లేకుండా వాట్సాప్ పనిచేయదని స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రకటించిన ‘సిమ్ అనివార్యం’ నిబంధనకు ఈ నెల 28నే గడువు అని, దానిని పొడిగించే అవకాశం లేదని కేంద్రం వెల్లడించింది.

కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకారం, ఈ నిర్ణయం జాతీయ భద్రత దృష్ట్యా తీసుకున్నదని తెలిపారు. సైబర్ నేరగాళ్ల కార్యకలాపాలను నియంత్రించేందుకు, యూజర్ల భద్రత కోసం ఈ కొత్త నియమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. కొత్త నిబంధనల ప్రకారం వాట్సాప్ మాత్రమే కాకుండా టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్‌చాట్, షేర్‌చాట్, జియోచాట్, అరాటై, జోష్ వంటి సోషల్ మీడియా యాప్‌లు ఉపయోగించాలంటే మొబైల్ ఫోన్‌లో చెల్లుబాటు అయ్యే సిమ్ కార్డు తప్పనిసరిగా ఉండాలి.

మార్చి 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. ఇంతవరకు మొబైల్ నుంచి సిమ్ కార్డు తీసేసినా వాట్సాప్ యాప్ పనిచేసేది. కానీ ఇకపై రిజిస్టర్డ్ సిమ్ ఫోన్‌లో ఉండాలి. అంతేకాదు, ఆ సిమ్ యాక్టివ్‌గా ఉండాలి. అంటే రీచార్జ్ చేసి పనిచేసే స్థితిలో ఉండాలి.

ఇంకా ఒక ముఖ్యమైన మార్పు కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో వాట్సాప్ వాడకానికి సంబంధించినది. ఇప్పటివరకు ఒకసారి లాగిన్ అయితే అనేక రోజుల పాటు యాక్టివ్‌గా ఉండేది. అయితే కొత్త నిబంధనల ప్రకారం కంప్యూటర్‌లో లాగిన్ చేసిన వాట్సాప్ ఆరు గంటల తర్వాత ఆటోమేటిక్‌గా లాగౌట్ అవుతుంది. మళ్లీ ఉపయోగించాలంటే మొబైల్‌లో యాక్టివ్ సిమ్ ఉండి, తిరిగి లాగిన్ చేయాలి.

గతంలో ఎక్కడి నుంచైనా ఓటీపీ ద్వారా వాట్సాప్‌కు లాగిన్ అయ్యే వీలుండేది. కానీ ఇకపై సిమ్ లేకుండా వాట్సాప్ ఉపయోగించడం సాధ్యం కాదు. ఈ చర్యలతో నకిలీ ఖాతాలు, సైబర్ నేరాలను తగ్గించవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

Also Read: Arunachalam: అరుణాచలం కొండపై తప్పక చూడాల్సిన ప్రదేశాలివే..!

Whatspp: మొబైల్ లో సిమ్ లేదా.. ఐతే వాట్సాప్ పనిచేయదు

Tagged cyber fraud, government deadline, India News, March 1, messaging app, messaging apps, mobile security, SIM binding rules, SIM Card, Tech News, tech update, WhatsApp, WhatsApp login

Post navigation

⟵ Arunachalam: అరుణాచలం కొండపై తప్పక చూడాల్సిన ప్రదేశాలివే..!
Loans: అప్పు తీసుకునేముందు/ఇచ్చే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి ⟶

Related Posts

Government proposal to preload Aadhaar app on phones faced pushback
Aadhaar App: కొత్త ఫోన్లలో ఆధార్ యాప్?

Aadhaar App: స్మార్ట్‌ఫోన్‌లలో ఆధార్ యాప్‌ను…

Does Charging Your Phone After 100% Damage the Battery?
Mobile Charging: ఫోన్ 100% ఛార్జింగ్ పెడితే.. ఈ రిస్క్ తప్పదు

Mobile Charging: మొబైల్ ఫోన్‌ను 100%…

Soon, WhatsApp will let you hide your phone number behind a username
Whatsapp: వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఇకపై మీ నంబర్ ఎవరూ చూడలేరు

Whatsapp: వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త. చాలా…

Latest Posts

  • Irumudi Vibe: ఇరుముడి’కి ట్రాక్టర్లలో పోటెత్తారు!
  • US Open Match: గంజాయి స్మెల్.. మ్యాచ్ మధ్యలో ఆపిన టెన్నిస్ స్టార్
  • No 1 Male Cricketer: ఇండియాలో నం.1 క్రికెటర్ ఇతడే..!
  • Pineapple After Meals: భోజనం తర్వాత పైనాపిల్ తింటే..
  • Nagarmal Bajoria: 281 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఒక్కసారి కూడా గెలవలేదు.. చివరికి మృతి!
  • Irumudi Piracy: ‘ఇరుముడి’కి షాక్.. వీధుల్లో ప్రొజెక్టర్ల ద్వారా ప్రదర్శన
  • Janmashtami 2026: జన్మాష్టమి.. ఈ రోజు ఈ మంత్రాన్ని 21 సార్లు జపించండి..!
  • Konda Surekha Post: త్వరలో బిగ్ అప్‌డేట్.. కొండా సురేఖ ఇంట్రస్టింగ్ పోస్ట్
  • Yesh Nagula Song: దుమ్ము రేపుతున్న ‘యేష నాగుల’ సాంగ్.. 5 రోజుల్లో 50 మిలియన్లు!
  • Morning Symptoms: నిద్ర లేవగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?
Copyright © 2026 Telugupost | Telugu Latest News | Rapid News by Ascendoor | Powered by WordPress.