Snake Revenge: పాములు పగబడతాయా.. తోటి పామును చంపారని ఇద్దరు పిల్లలపై..

Snake Revenge on Bro & Sister

Snake Revenge: పాములు నిజంగానే పగపడతాయా(Snake Revenge)? సినిమాల్లోనే, ఏదైనా కథల్లోనూ ఇలాంటి వాటి గురించి విని, చూసి ఉంటాం. కానీ బయట కూడా అలా జరుగుతుందా.. తోటి పామును చంపితే రెండో పాము వచ్చి పగ తీర్చుకుంటుందా? ఈ మూఢనమ్మకం చుట్టూ ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఇంట్లో నిద్రిస్తున్న అన్నాచెల్లెళ్లపై ఒక కట్లపాము దాడి చేసి కాటేసింది. ఈ ప్రమాదంలో 6 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయింది. మరో 4 ఏళ్ల బాలిక ఇప్పుడు ఆసుపత్రిలో ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ (Jhansi) జిల్లా బడాగావ్ పరిధిలో జరిగింది. ఈ అత్యంత విషాదకర సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

A six year old innocent child was bitten by a krait snake

అసలు ఏం జరిగింది?

ఝాన్సీ సమీపంలోని బడాగావ్‌కు చెందిన ప్రదీప్ కుష్వాహా భార్య నేహ తన ఇద్దరు పిల్లలు మయాంక్ (6), ప్రగతి (4)లతో కలిసి ఇంట్లో నిద్రపోతోంది. ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో 4 ఏళ్ల కూతురు ప్రగతి పాము కాటు వేయడంతో బిగ్గరగా ఏడ్చింది. తల్లి నేహ వెంటనే పాపను ఎత్తుకుని అత్తగారికి అప్పగించింది.

అంతలోనే కొడుకు మయాంక్ కూడా తీవ్రంగా ఏడవడం ప్రారంభించాడు. నేహ వెళ్లి చూడగా బాలుడి శరీరానికి ఒక కట్ల పాము చుట్టుకుని కనిపించింది. అది ఆ చిన్నారిని 3 నుండి 4 చోట్ల తీవ్రంగా కాటేసింది. కుటుంబ సభ్యులు బాలుడిని విడిపించి ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఉదయం 9:30 గంటలకు మయాంక్ మరణించాడు.

పాము నిజంగానే పగ తీర్చుకుందా?

బాధిత తల్లి నేహ చెప్పిన విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసాయి. రెండు మూడు రోజుల క్రితమే తమ ఇంట్లో ఒక జంట పాములు కనిపించాయని, అప్పుడు ఇంట్లోని వారు ఒక పామును కొట్టి చంపేయగా మరో పాము తప్పించుకుందని తెలిపింది. ఆ తప్పించుకున్న పామే ఇప్పుడు వచ్చి తన పిల్లలను మింగేసిందని ఆవేదన వ్యక్తం చేసింది.

డాక్టర్లు ఏమంటున్నారు? (Myth vs Reality)

బాధిత తల్లి వాదనను వైద్యులు పూర్తిగా తప్పుపట్టారు. పాము పగ తీర్చుకుందనేది కేవలం ఒక అపోహ (Myth) మాత్రమేనని స్పష్టం చేశారు.

  • జ్ఞాపకశక్తి ఉండదు: పాములకు మనుషుల రూపాలను గుర్తుపట్టేంత లేదా “పగ” తీర్చుకునేంత మెదడు పరిణతి ఉండదు.

  • వెచ్చదనం కోసమే వస్తాయి: వర్షాకాలంలో గుంటలు, పొలాల్లో నీరు చేరడంతో పాములు పొడి ప్రదేశాలు, మానవ శరీర వెచ్చదనాన్ని వెతుక్కుంటూ ఇళ్లలోకి వస్తాయి.

  • అక్కడ ముందే రెండు పాములు ఉండి ఉంటాయని, ఒకదాన్ని చంపినప్పుడు రెండోది తప్పించుకుని ఇంట్లోనే నక్కి ఉండి ఉంటుందని వైద్యులు వెల్లడించారు.

వైద్యుల అత్యవసర సూచనలు

విషపూరితమైన పాము కరిచినప్పుడు టైమ్ వేస్ట్ చేయకుండా పాటించాల్సిన నియమాలు:

  1. మూఢనమ్మకాలు నమ్మవద్దు: మంత్రగాళ్ళు, నాటు వైద్యం అని సమయం వృథా చేస్తే ప్రాణాలకే ప్రమాదం.

  2. యాంటీ స్నేక్ వెనమ్ (Anti-Snake Venom): వెంటనే ప్రభుత్వ లేదా పెద్ద ఆస్పత్రికి తరలించి యాంటీ వెనమ్ ఇంజెక్షన్ ఇప్పించాలి.

  3. కదలకుండా ఉంచాలి: బాధితుడు కంగారుపడి పరుగెత్తితే గుండె కొట్టుకునే వేగం పెరిగి విషం రక్తం ద్వారా వేగంగా ఒంటికి పడుతుంది.

పాములు పగపడతాయనే అపోహలను పక్కనబెట్టి, వర్షాకాలంలో ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, నేలపై పడుకోకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇటువంటి అనర్థాలను నివారించవచ్చు.

Also Read: Buy Digital Gold with Rs.10: రూ.10లకే బంగారం కొనవచ్చని మీకు తెలుసా? అది కూడా మీ మొబైల్ నుండే