Make Money Online: ChatGPT, Canva ద్వారా ఆన్‌లైన్‌లో నెలకు రూ.30,000 ఎలా సంపాదించాలి?

Make Money Online Using ChatGPT & Canva AI

Make Money Online: టెక్నాలజీ (Technology) రోజురోజుకూ వేగంగా మారుతోంది. అర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ (Artificial Intelligence –AI) వచ్చాక సాంకేతికతలో ఎన్నడూ లేనంత మార్పులు వస్తున్నాయి. ఈ టూల్స్ కేవలం ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికే కాకుండా, ఇంట్లోనే ఉండి నెలకు వేలల్లో ఆదాయం( సంపాదించడానికి కూడా ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఎలాంటి కోడింగ్, కోర్సులు చేయకుండానే ఇప్పటికే చాలా మంది ఆన్ లైన్ లో నెలకు వేలల్లో(Make Money Online) సంపాదిస్తున్నారు. మరి దీనికి ఏమైనా డబ్బులు కట్టాలా అంటే.. అస్సలు కాదు. ఫ్రీ AI టూల్స్ తోనే ఎంతో మంది తమ కుటుంబాలకు ఆర్థికంగా సాయపడుతున్నారు. మరి మీరు కూడా ఇలా ఆన్ లైన్ లో డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా.. అయితే ఉచిత ఏఐ టూల్స్ ఏమేం ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

 money earn use with ChatGPT

1. ChatGPT & AI ద్వారా కంటెంట్ రైటింగ్ (Content Writing)

మీకు రాయడంపై ఆసక్తి ఉంటే, ChatGPT ని ఉపయోగించి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలు, బ్లాగర్లు మరియు యూట్యూబర్లకు వ్యాసాలు (Articles), స్క్రిప్ట్‌లు రాసి ఇవ్వొచ్చు.

  • ఎలా చేయాలి: గూగుల్ డాక్స్ లేదా ChatGPT సహాయంతో SEO Friendly కంటెంట్, సోషల్ మీడియా క్యాప్షన్లు సిద్ధం చేయొచ్చు.

  • ఎక్కడ అవకాశాలు ఉంటాయి: Freelancer.com, Upwork, Fiverr లాంటి వెబ్‌సైట్లలో కస్టమర్లు లభిస్తారు.

2. Canva AI & ChatGPT ద్వారా సోషల్ మీడియా పోస్ట్‌లు/గ్రాఫిక్స్

చిన్న వ్యాపారాలకు (Small Businesses) సోషల్ మీడియా పోస్టర్లు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ టెంప్లేట్లు, YouTube Thumbnails చేయడం చాలా అవసరం.

  • ఎలా చేయాలి: ChatGPT ద్వారా ఐడియాలు, కంటెంట్ జనరేట్ చేసి, Canva (Magic Design Tool) ద్వారా ఆకర్షణీయమైన డిజైన్స్ నిమిషాల్లో రూపొందించవచ్చు.

  • ఆదాయం: ఒక్కో పోస్టర్ డిజైన్‌కు రూ.300 నుండి రూ.1,000 వరకు వసూలు చేయవచ్చు.

5 best ChatGPT education apps: Top AI tools for learning | Jotform Blog

3. AI Logo & Brand Design (లోగో డిజైనింగ్)

కొత్తగా స్టార్టప్ మొదలుపెట్టే వారికి డిజిటల్ లోగోలు అవసరం ఉంటాయి. Midjourney, Bing Image Creator లేదా Canva AI వాడి బ్రాండ్ లోగోలను సులభంగా క్రియేట్ చేయవచ్చు.

AI ద్వారా నెలకు వచ్చే సగటు ఆదాయ వివరాలు:

పని / సేవ (Service) ఉపయోగపడే AI టూల్ నెలకు సగటు ఆదాయ అంచనా
కంటెంట్ రైటింగ్ ChatGPT, Gemini AI రూ.15,000 – రూ.30,000
గ్రాఫిక్స్ & గ్రాఫిక్ డిజైన్ Canva AI, Bing Image Creator రూ.10,000 – రూ.25,000
సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ ChatGPT + Canva రూ.20,000 – రూ.40,000

ఇక్కడ ప్రత్యేకంగా చెప్పదగిన విషయమేమిటంటే, AI టూల్స్ మీ స్థానాన్ని పూర్తిగా భర్తీ చేయవు. కానీ AI వాడకం తెలిసిన వారు రోజువారీ పనులను మరింత వేగంగా చేస్తూ ఎక్కువ ఆదాయం పొందగలరు. సరైన క్రమశిక్షణతో రోజుకు 2-3 గంటలు కేటాయిస్తే ఉచిత ఐటీ టూల్స్ ద్వారా మంచి సైడ్ ఇన్కమ్ పొందొచ్చు.

Also Read: Jio AirFiber vs Airtel Xstream AirFiber: తక్కువ ధరలో ఫ్రీ OTTలు ఇచ్చే బెస్ట్ ప్లాన్ ఏది?