Free CIBIL Score Check Online 2026: మీరు ఏదైనా బ్యాంక్‌లో పర్సనల్ లోన్, హోమ్ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ లాంటి వాటి కోసం అప్లై చేయాలంటే బ్యాంకర్లు మొదట చూసేది మీ సిబిల్ స్కోరే (CIBIL Score / Credit Score). దీన్నే క్రెడిటె స్కోర్ అని కూడా పిలుస్తారు. సిబిల్ స్కోర్ మంచిగా ఉంటే తక్కువ వడ్డీకే లోన్లు మంజూరవుతాయి. సాధారణంగా చాలా మంది తమ క్రెడిట్ స్కోర్ తెలుసుకునేందుకు డబ్బులు చెల్లిస్తుంటారు, కానీ 2026 లో ఉచితంగా, సురక్షితంగా మీ సిబిల్ స్కోర్‌ను ఆన్లైన్(Free CIBIL Score Check Online 2026)లో చెక్ చేసుకోవచ్చు. అది కూడా వాట్సాప్, అధికారిక పోర్టల్స్ ద్వారా ఉచితంగానే. మరి ఎలా అప్రోచ్ అవ్వాలి.. సిబిల్ స్కోర్ ఎలా చెక్ చేసుకోవాలి.. అసలు సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి అన్న విషయానికొస్తే..

సిబిల్ స్కోర్ ఎంత ఉంటే మంచిది?
-
750 నుండి 900: ఎక్సలెంట్ స్కోర్. తక్కువ వడ్డీకే లోన్లు వెంటనే అప్రూవ్ అవుతాయి.
-
700 నుండి 749: గుడ్ స్కోర్. సాధారణ వడ్డీ రేట్లకు లోన్ లభిస్తుంది.
-
650 కంటే తక్కువ: లోన్ అప్లికేషన్ తిరస్కరించే అవకాశం ఎక్కువ.
వాట్సాప్ ద్వారా ఉచిత సిబిల్ స్కోర్ చెక్ చేసే ప్రాసెస్
ఇటీవల ప్రముఖ క్రెడిట్ బ్యూరోలు వాట్సాప్‌లోనే క్రెడిట్ రిపోర్ట్ ఇచ్చే వెసులుబాటు తీసుకొచ్చాయి:
-
అధికారిక వెరిఫైడ్ వాట్సాప్ నంబర్‌కు (ఉదా: Experian / CIBIL) ‘Hi’ అని మెసేజ్ పంపండి.
-
మీ పూర్తి పేరు (పాన్ కార్డ్ ప్రకారం) నమోదు చేయండి.
-
మీ పాన్ కార్డ్ నంబర్, ఇమెయిల్ ఐడీ టైప్ చేయండి.
-
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ని ఎంటర్ చేసి వెరిఫై చేయండి.
-
కొద్ది సెకన్లలోనే మీ సిబిల్ స్కోర్, పూర్తి క్రెడిట్ రిపోర్ట్ PDF రూపంలో వాట్సాప్‌కి వస్తుంది.
ఆన్లైన్ పోర్టల్స్ ద్వారా ఉచితంగా చెక్ చేసే లింక్స్
మీరు క్రింది అధికారిక పోర్టల్స్ ద్వారా కూడా మీ పాన్ కార్డ్‌తో ఫ్రీగా సిబిల్ స్కోర్ చెక్ చేయవచ్చు:
🔗 పోర్టల్ 1: Official CIBIL India Free Check Portal
🔗 పోర్టల్ 2: Experian Credit Score Free Check Portal
సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి చిట్కాలు
-
మీ లోన్ EMIలు మరియు క్రెడిట్ కార్డ్ బిల్లులను గడువు తేదిలోపు చెల్లించండి.
-
ఒకేసారి ఎక్కువ బ్యాంక్ లోన్ల కోసం అప్లై చేయకండి.
-
మీ క్రెడిట్ లిమిట్లో 30% కంటే ఎక్కువ వాడకూడదు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
Q1. సిబిల్ స్కోర్ చెక్ చేయడం వల్ల స్కోర్ తగ్గుతుందా? జ: లేదు. మీ అంతట మీరు స్కోర్ చెక్ చేసుకుంటే (Soft Inquiry) స్కోర్ అస్సలు తగ్గదు.
Q2. సిబిల్ స్కోర్ ఉచితంగా ఎన్నిసార్లు చెక్ చేయవచ్చు? జ: నెలకు ఒకసారి ఉచితంగా మీ క్రెడిట్ రిపోర్ట్ పొందవచ్చు.
మీరు ఏదైనా లోన్ కోసం వెళ్లేముందు మీ సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవడం మంచిది. పైన పేర్కొన్న సులువైన మార్గాల ద్వారా మీ స్కోర్‌ను ఇప్పుడే ఉచితంగా తెలుసుకోండి.
