IPL 2026: ఐపీఎల్ 2026లో ఢిల్లీలో జరుగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్–పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అక్షర్ పటేల్ వేసిన 2.3వ బంతికి ప్రియాంశ్ ఆర్య ఇచ్చిన క్యాచ్‌ను అందుకునేందుకు లుంగి ఎంగిడి మిడ్ ఆఫ్ వైపు వెనక్కి పరిగెత్తాడు. అయితే క్యాచ్ పట్టే సమయంలో బ్యాలెన్స్ కోల్పోయి వెనక్కి పడిపోయి, అతని తల మైదానానికి బలంగా తగిలింది. దీంతో వెంటనే మైదానంలోనే కుప్పకూలిపోయాడు. ఈ సంఘటనతో ఆటగాళ్లు, అంపైర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
వెంటనే ఫిజియోలు, డాక్టర్లు మైదానంలోకి వచ్చి ఎంగిడిని పరీక్షించారు. అతడు కదలడానికి కూడా ఇబ్బంది పడుతుండటంతో అంబులెన్స్‌ను పిలిపించారు. మొదట కొంత సహకరించినా, తర్వాత చలనం లేకుండా ఉండిపోయాడు. తలకు బ్యాండేజ్ వేసి స్ట్రెచర్‌పై ఆసుపత్రికి తరలించారు. డేవిడ్ మిల్లర్, స్టబ్స్ వంటి సహచరులు షాక్‌కు గురయ్యారు. కోచ్ రికీ పాంటింగ్ కూడా మైదానంలోకి వచ్చి పరిస్థితిని పరిశీలించాడు. దీంతో కొంతసేపు ఆట నిలిచిపోయింది. ఈ మ్యాచ్‌లో ఎంగిడి మళ్లీ ఆడే అవకాశాలు లేవు, అతని స్థానంలో చమీరా బౌలింగ్‌కు సిద్ధమయ్యాడు.
మ్యాచ్ విషయానికి వస్తే, టాస్ గెలిచిన ఢిల్లీ ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 2 వికెట్లకు 264 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడి 67 బంతుల్లో 152 పరుగులతో అజేయంగా నిలిచాడు. నితీశ్ రాణా 44 బంతుల్లో 91 పరుగులు చేసి సెంచరీకి తృటిలో చేజారాడు. 265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు దూకుడుగా ఆడుతోంది. ఈ సమాచారం రాసే సమయానికి 3.3 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 75 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ 40*, ప్రియాంశ్ ఆర్య 31*తో క్రీజులో ఉన్నారు.
Also Read: Reliance Jio: 10కిపైగా OTTల సబ్‌స్క్రిప్షన్స్‌తో జియో కొత్త ప్లాన్
IPL 2026: క్యాచ్ పట్టబోయి.. ఎగిరిపడ్డాడు.. వీడియో చూసేయండి
