Aadhaar Address Update: దేశంలో ఏ చిన్న లేదా పెద్ద పనికైనా ఈ రోజుల్లో ఆధార్ కార్డు అత్యంత ముఖ్యమైనది మారిపోయింది. అది లేకపోతే ఏ పనీ కాదు అన్న చందంగా మారింది. బ్యాంకింగ్(banking), రేషన్ కార్డ్(Ration Card), పాన్ కార్డ్(Pan Card) లింకింగ్ నుండి ప్రభుత్వ పథకాల వరకు అన్నింటికీ ఆధార్‌లో సరైన అడ్రస్, క్రియాశీలకంగా ఉన్న మొబైల్ నంబర్(Mobile Number) ఉండటం తప్పనిసరైంది. అయితే, కొన్నిసార్లు ఆధార్ కార్డులో అడ్రస్ పడే అవకాశం ఉంది. లేదంటే మొబైల్ నంబర్ కు లింక్ కాదు. అలాంటి సమయాల్లో ఆధార్ సెంటర్ వద్ద గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. UIDAI పోర్టల్ ద్వారా మీ ఇంట్లో కూర్చునే మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా వీటిని సులభంగా అప్డేట(Aadhaar Address Update) చేసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఆధార్ కార్డ్‌లో అడ్రస్ (చిరునామా) ఆన్లైన్లో అప్డేట్ చేసే విధానం:
మీ ఆధార్ కార్డ్‌కి ఇప్పటికే మీ మొబైల్ నంబర్ లింక్ అయి ఉంటే, అడ్రస్ చేంజ్ చేయడం చాలా సులభం:
-
Step 1: ముందుగా UIDAI అధికారిక పోర్టల్ myAadhaar.uidai.gov.in కు వెళ్లి, ‘Login’ పై క్లిక్ చేయండి.
-
Step 2: మీ కార్డ్ నంబర్, క్యాప్చా (Captcha) ఎంటర్ చేసి, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
-
Step 3: డాష్‌బోర్డ్‌లో ఉన్న “Address Update” ఆప్షన్‌ను ఎంచుకోండి.
-
Step 4: మీ కొత్త అడ్రస్‌ను స్పష్టంగా టైప్ చేసి, దానికి మద్దతు ఇచ్చే ఏదైనా ఒక వాలిడ్ ప్రూఫ్ (ఓటర్ కార్డ్, పోస్ట్ ఆఫీస్ అకౌంట్ స్టేట్మెంట్, రేషన్ కార్డ్, ఎలక్ట్రిసిటీ బిల్ లేదా పాస్‌పోర్ట్) ను PDF లేదా JPEG ఫార్మాట్లో అప్లోడ్ చేయండి.
-
Step 5: ఆ తర్వాత నిర్ణీత ఫీజు (రూ.50) ఆన్లైన్ (UPI/Debit Card) ద్వారా చెల్లించండి. మీకు లభించే SRN (Service Request Number) తో మీ అప్లికేషన్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు. సాధారణంగా 7 నుండి 15 రోజుల్లో ఈ కొత్త అడ్రస్ అప్డేట్ అవుతుంది.

2. ఇంట్లోనే ఆధార్‌కి మొబైల్ నంబర్ లింక్ / అప్డేట్ చేయడం ఎలా?
అన్ని పథకాలు లేదా పనులకు బయోమెట్రిక్ వెరిఫికేషన్ అవసరం ఉన్నందున మొబైల్ నంబర్ అప్డేట్ నేరుగా వెబ్సైట్ ద్వారా జరగదు. కానీ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB Doorstep Banking) సర్వీస్ ద్వారా పోస్ట్‌మ్యాన్‌ను మీ ఇంటికే రప్పించుకోవచ్చు:
-
Step 1: బ్రౌజర్లో ccc.cept.gov.in/service-request పేజీ ఓపెన్ చేయండి.
-
Step 2: మీ పేరు, పూర్తి చిరునామా, పిన్ కోడ్, ఈమెయిల్, మొబైల్ నంబర్ నమోదు చేయండి.
-
Step 3: ‘Service’ కేటగిరీలో “IPPB – Aadhaar Service” ని ఎంచుకుని, “UIDAI – Mobile/Email Update” ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి.
-
Step 4: ‘Request OTP’ పై క్లిక్ చేసి వివరాలు టైప్ చేయండి. పోస్ట్ ఆఫీస్ ప్రతినిధి మీ ఇంటికి వచ్చి బయోమెట్రిక్ యంత్రం ద్వారా మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేస్తారు (దీనికి రూ.50 చార్జ్ ఉంటుంది).
ఆధార్ అడ్రస్ అప్డేట్ చేయడానికి ఏయే డాక్యుమెంట్లు కావాలి?
-
ఓటర్ ఐడీ కార్డ్ (Voter ID)
-
రేషన్ కార్డ్ (Ration Card)
-
విద్యుత్ బిల్లు / వాటర్ బిల్లు (గత 3 నెలలవి)
-
బ్యాంక్ పాస్‌బుక్ / స్టేట్మెంట్
-
పాస్‌పోర్ట్ (Passport)
-
రిజిస్టర్డ్ రెంట్ అగ్రిమెంట్ (Rent Agreement)
డాక్యుమెంట్లు లేకపోతే? (Head of Family – HoF ద్వారా)
ఒకవేళ మీ పేరు మీద ఎలాంటి అడ్రస్ ప్రూఫ్ లేకపోతే, మీ కుటుంబ పెద్ద (తండ్రి, భర్త, లేదా తల్లి) ఆధార్ అడ్రస్ ఆధారంగా మీ అడ్రస్ మార్చుకోవచ్చు.
-
లాగిన్ అయిన తర్వాత ‘Head of Family (HoF) based Address Update’ ఆప్షన్ ఎంచుకోవాలి.
-
మీ కుటుంబ పెద్ద ఆధార్ నంబర్, మీతో ఉన్న సంబంధాన్ని (Relationship) నమోదు చేయాలి.
-
సంబంధాన్ని తెలిపే పత్రం (Ration Card, Birth Certificate) లేదా HoF సెల్ఫ్ డిక్లరేషన్ ఫారమ్ అప్లోడ్ చేయాలి.
-
అభ్యర్థన సమర్పించిన తర్వాత, కుటుంబ పెద్ద తన myAadhaar లాగిన్లోకి వెళ్ళి 30 రోజుల్లోగా ఈ రిక్వెస్ట్‌ను ఆమోదించాలి (Approve).
స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత myAadhaar పోర్టల్‌లోని ‘Check Enrolment & Update Status’ పై క్లిక్ చేసి, మీ URN నంబర్ ఎంటర్ చేస్తే అప్డేట్ అయిందో లేదో తెలుస్తుంది. సాధారణంగా 3 నుండి 15 రోజుల్లో ఆధార్ అడ్రస్ అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత ఇ-ఆధార్ (e-Aadhaar) ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
చాలా మంది ఆధార్ కార్డ్ లో మార్పుల కోసం అనవసరంగా డబ్బులు వెచ్చిస్తుంటారు. కానీ పైన చెప్పిన డిజిటల్ పద్ధతులను ఉపయోగిస్తే ఏజెన్సీలకు డబ్బులు చెల్లించడం తప్పుతుంది. మీరు కూడా మీ ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవాలని చూస్తున్నారా.. ఐతే ఇంకెందుకు ఆలస్యం ఎక్కడికీ వెళ్లకుండా.. ఇంట్లో కూర్చొనే మార్పులు చేసుకోండి.
Also Read: APK Safety Tips: APK ఫైల్స్ ఇన్స్టాల్ చేస్తున్నారా? మీ ఫోన్ హ్యాక్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
