Periods in Temple: గుళ్లో ఉండగా పిరియడ్స్ వస్తే ఏం చేయాలి? పురాణాలు, శాస్త్రాలు ఏం చెప్తున్నాయి?

Periods in Temple rules in Telugu

Periods in Temple: మహిళలకు రుతుక్రమం అనేది సాధారణంగా జరిగే ప్రక్రియే. ఆ సమయంలో మహిళలను ఎవర్నీ గుళ్లోకి, పవిత్రమైన శుభకార్యాలకు రానివ్వరు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మన దేశంలో దేవాలయాలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఆచార వ్యవహారాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. పూజలు, వ్రతాలు లేదా గుడికి వెళ్లే సమయంలో మహిళలు రుతుక్రమం (Periods) కి దూరంగా ఉండటం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే, కొన్నిసార్లు దైవ దర్శనం చేసుకుంటుండగా లేదా ఆలయ ప్రాంగణంలో ఉన్నప్పుడు అనుకోకుండా పిరియడ్స్ (Periods in Temple) వస్తుంటాయి. అలాంటి సమయంలో చాలామంది మహిళలు తీవ్ర భయాందోళనకు  గురవుతుంటారు. ఇది పాపమని, దేవుని ఆగ్రహానికి గురవుతామేమోనని భయపడుతుంటారు. మరి అసలు ఈ పరిస్థితి ఎదురైతే ఏం చేయాలి? మన పురాణాలు, ధర్మశాస్త్రాలు ఈ విషయంపై ఏం చెప్తున్నాయి?

In My Telugu Brahmin Family, I Saw How Periods Are Used To Support Patriarchy

పురాణాలు, శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే:

పురాణాల్లో రుతుస్రావాన్ని అశుద్ధం అనలేదు కానీ సృష్టికి మూలం అని అన్నారు. భూదేవి కూడా రుతుస్రావం అవుతుందని, అందుకే ఏటా అంబుబాచి మేళా సమయంలో కామాఖ్య ఆలయం 3 రోజులు మూసేస్తారు. ఈ విషయం చాలా మందికి తెలుసు. మరి గుడికి ఎందుకు వద్దన్నారు అంటే దానికి ఆధ్యాత్మిక నిపుణులు ప్రకారం అందుకు 3 కారణాలు చెప్తారు :

విశ్రాంతి కోసం: పూర్వం గుడికి వెళ్లాలంటే నడిచి వెళ్లాలి, మెట్లు ఎక్కాలి, గంటల తరబడి నిలబడాలి. పీరియడ్స్ టైంలో శరీరం బలహీనంగా ఉంటుంది కాబట్టి ఇంట్లోనే విశ్రాంతి తీసుకోమన్నారు.

శక్తి తత్వం: ఆలయాలు మంత్రాలతో, ప్రాణ ప్రతిష్టతో ఎక్కువ ఎనర్జీ ఉన్న ప్రదేశాలు. ఆ టైంలో స్త్రీ శరీరంలో అపాయవాయువు అంటే శక్తి కిందికి ప్రవహిస్తుంది. ఆలయంలో శక్తి పైకి లాగుతుంది. ఈ రెండు వ్యతిరేక శక్తులు కలిస్తే గర్భాశయ ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని శాస్త్రాల్లో చెప్పారు.

శుభ్రత: పూర్వం ఇప్పటిలా శానిటరీ ప్యాడ్స్ లేవు. ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండటానికి దూరంగా ఉంచేవారు.

అంటే ఇది పవిత్రతను తక్కువ చేయడం కాదు, ఆరోగ్యాన్ని కాపాడటం కోసమే.

How to Deal With Period-Related Skin Problems | Water's Edge

గుళ్లో ఉండగా పిరియడ్స్ వస్తే ఏం చేయాలి?

ప్రశాంతంగా ఉండండి:

ఇది శరీరంలో సహజంగా జరిగే ప్రక్రియ. మీరు కావాలనుకుని చేయలేదు. అనుకోకుండా జరిగింది. కాబట్టి మీ మనస్సులో ఎలాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఉండండి.

బయటకు రండి:

ఒకవేళ గుళ్లో లైన్ లో ఉండగా హఠాత్తుగా వచ్చినా కంగారు పడకండి. ఎవరికీ తెలియకుండా సైడ్ కి వచ్చేసి, దర్శనం అక్కడితో ఆపేయండి.

తీర్థ ప్రసాదాలు, విగ్రహాలను తాకకండి:

ఒకవేళ మీరు గుళ్లో ఉన్నప్పుడే పిరియడ్స్ వస్తే పండితులు ఇచ్చే తీర్థం, ప్రసాదాన్ని సున్నితంగా వద్దని చెప్పండి. అలాగే అక్కడి విగ్రహాలు, పూజా వస్తువులను కూడా తాకకుండా ఉంటే మంచిది.

ఇంటికి వెళ్లాక స్నానం:

గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత శుభ్రంగా స్నానం చేసి విశ్రాంతి తీసుకోవాలి.

Also Read: Zero Skills Freelancing: Upwork, Fiverr లో ఎలాంటి స్కిల్స్ లేకుండా పార్ట్‌టైమ్ వర్క్ చేయొచ్చా?