Pani Puri: చాలా మందికి ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ పానీపూరి. సాయంత్రం అయ్యిందంటే చాలు పానీపూరి బండ్ల దగ్గర జనాలు క్యూలు కడతారు. చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ దీన్ని ఆస్వాదిస్తారు.
పానీపూరి తినడం వల్ల కేవలం నష్టాలు మాత్రమే కాకుండా కొన్ని లాభాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. పుదీనా, జీలకర్ర వంటి పదార్థాలు ఉండటంతో ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీంతో తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది, జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటంతో శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే బంగాళాదుంపలు, శనగలు వాడటం వల్ల విటమిన్లు, ఖనిజాలు కూడా అందుతాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలు ఇచ్చి ఉత్తేజంగా ఉంచుతాయి. కొందరికి నోటి పూత సమస్య ఉన్నప్పుడు పానీపూరి తింటే కొంత ఉపశమనం లభించవచ్చని అంటున్నారు.
అయితే పానీపూరిని శుభ్రంగా తయారు చేసినదే తినాలి. ఉపయోగించే నీరు పరిశుభ్రంగా ఉండాలి. ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా తినకూడదు. ముఖ్యంగా జీర్ణ సమస్యలు ఉన్నవారు ముందుగా డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. ఇంట్లో తయారు చేసుకుని తినడం ఇంకా సురక్షితం.
