Life Style: చాలామంది భోజన సమయంలో చపాతీ, అన్నం రెండింటినీ ఒకేసారి తినే అలవాటు కలిగి ఉంటారు. అయితే ఇలా చేయడం మంచిది కాదని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. ఈ రెండు ఆహారాలను కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం పడే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.
చపాతీ, అన్నం రెండింటిలోనూ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. వీటిని ఒకేసారి ఎక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల శరీరానికి అదనపు కేలరీలు అందుతాయి. దీని కారణంగా బరువు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఈ ఆహారాల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగవచ్చు.
అంతేకాకుండా, చపాతీ మరియు అన్నాన్ని కలిపి తినడం వల్ల గ్యాస్, అజీర్ణం, కడుపుబ్బరం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. శరీరంలో స్టార్చ్ ప్రాసెసింగ్‌పై కూడా ఇది ప్రభావం చూపవచ్చని అభిప్రాయపడుతున్నారు.
నిపుణుల సూచనల ప్రకారం, చపాతీ మరియు అన్నాన్ని ఒకేసారి తీసుకోవడం కంటే వేర్వేరు సమయాల్లో తీసుకోవడం మంచిది. ఒకవేళ రెండింటినీ తినాలనుకుంటే వాటి మధ్య కొంత విరామం ఇవ్వడం ఉత్తమం. ఉదాహరణకు, ముందుగా చపాతీ తిని, తర్వాత రెండు గంటల విరామం తర్వాత అన్నం తీసుకోవచ్చు.
ఇలా వేర్వేరుగా తీసుకోవడం వల్ల రెండు ఆహారాల్లోని పోషకాలను సమర్థవంతంగా పొందడంతో పాటు జీర్ణ సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చు. గ్యాస్, అజీర్ణం, కడుపు నొప్పి వంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
అయితే ఆహారపు అలవాట్లు వ్యక్తిగత ఆరోగ్యం, జీవనశైలి, శారీరక శ్రమ వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి మీ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా ఆహార నియమాలను పాటించడం ఉత్తమం.
Also Read: Trisha: త్రిషకు మెగా ఫ్యామిలీ సర్‌ప్రైజ్ గిఫ్ట్!
Life Style: చపాతీ, రైస్ కలిపి తింటున్నారా?
