Mysuru Suicide Case: పెళ్లింట్లో చావు డప్పులు.. పెళ్లి కొడుక్కి ఆ ఫొటోలు పంపాడని..!

Mysuru Suicide Case_ Shocking twist as 3 of a family end lives over wedding photo blackmailing!

Mysuru Suicide Case: పెళ్లి పనులతో పచ్చని పందిళ్లు, బంధువుల కోలాహలంతో కళకళలాడాల్సిన ఒక ఇల్లు.. ఒక యువకుడి ఉన్మాదం వల్ల (Mysuru Suicide Case) శ్మశానంగా మారింది. స్నేహం పేరిట దగ్గరై, కలిసి తీసుకున్న ఫొటోలను అడ్డుపెట్టుకుని చేసిన బెదిరింపులకు తట్టుకోలేక ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన కర్ణాటకలో తీవ్ర కలకలం రేపింది.

స్నేహమే శాపమైంది..

కర్ణాటక రాష్ట్రం మైసూరు జిల్లా కెంపయ్యనహుండి గ్రామానికి చెందిన శివణ్ణ, నాగరత్న దంపతుల కుమార్తె రక్షిత(Rakshitha)కు ఇటీవల ఒక మంచి సంబంధం చూసి వివాహం నిశ్చయించారు. అయితే, పెళ్లికి ముందు ఆమెకు ఉల్లాస్ గౌడ (Ullas Gowda( అనే యువకుడితో పరిచయం, స్నేహం ఉండేది. ఆ సమయంలో వారిద్దరూ సాధారణంగా కలిసి కొన్ని ఫొటోలు తీసుకున్నారు. కానీ, రక్షితకు వేరే వ్యక్తితో పెళ్లి కుదరడాన్ని ఉల్లాస్ తట్టుకోలేకపోయాడు. దీనివల్ల, తనే నిన్ను ప్రేమిస్తున్నానని, తనను పెళ్లి చేసుకోకపోతే కల్యాణ మండపానికి వచ్చి పెళ్లి ఆపేస్తానని రక్షితను తీవ్రంగా భయపెట్టడం (Blackmailing) ప్రారంభించాడు.

వరుడికి ఫొటోలు పంపి వికృత చేష్టలు..

రక్షిత లొంగకపోవడంతో ఉల్లాస్ గౌడ డిజిటల్ మాధ్యమా(Digital Media)ను అడ్డుపెట్టుకుని వికృత చేష్టలకు దిగాడు. తామిద్దరూ సన్నిహితంగా ఉన్నట్లు కనిపించే ఫొటోలను రక్షిత పెళ్లి చేసుకోబోయే వరుడికి, అతడి కుటుంబ సభ్యులకు వాట్సాప్ ద్వారా పంపించి కుట్రకు తెగించాడు. ఎందుకంటే, ఎలాగైనా ఆ పెళ్లి చెడగొట్టాలనేది అతడి ప్లాన్. అనుకున్నట్టుగానే ఈ విషయం తెలిసి రక్షితతో పాటు ఆమె తల్లిదండ్రులు తీవ్ర అవమానభారానికి లోనయ్యారు. సమాజంలో, బంధువుల్లో తలదించుకోవాల్సి వచ్చిందనే బాధ వారిని మానసికంగా(Mysuru Suicide Case) తీవ్రంగా కుంగదీసింది.

Mysuru triple suicide: Bride-to-be, parents end lives ahead of wedding after morphed photos sent to groom | Mysuru News - The Times of India

ఘటనా స్థలంలో ఆత్మహత్య లేఖ..

ఉల్లాస్ గౌడ వేధింపులు, సమాజం ఏమనుకుంటుందో అనే ఆందోళన తాళలేక రక్షిత, ఆమె తండ్రి శివణ్ణ, తల్లి నాగరత్న ఒకేసారి బలవన్మరణానికి పాల్పడ్డారు. మొదటగా వారు ముగ్గురూ విషం తాగి, ఆ తర్వాత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అంతేకాకుండా, తాము చనిపోవడానికి ఉల్లాస్ గౌడ కారణమంటూ ఒక సుదీర్ఘ ఆత్మహత్య లేఖ (Death Note) రాసి పెట్టారు. సమాచారం అందుకున్న టి. నరసేపుర పట్టణ ఠాణా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లేఖను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఉల్లాస్ గౌడపై కేసు నమోదు చేసి, అతడి కోసం గాలిస్తున్నారు.

సైబర్ నిపుణుల హెచ్చరిక:

ఇలాంటి సమయాల్లో ధైర్యం ముఖ్యం:

ఈ రోజుల్లో ఇలాంటి డిజిటల్ బ్లాక్‌మెయిలింగ్స్ (Digital Blackmailing) ఎక్కువవుతున్నాయి. అందువల్ల, ఫొటోలు, వీడియోల పేరుతో ఎవరైనా బెదిరింపులకు దిగితే భయపడి ప్రాణాలు తీసుకోవద్దని సైబర్ నిపుణులు (Cyber Experts) మరియు పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిజానికి, తప్పు చేసినవాడు శిక్ష అనుభవిస్తాడు కానీ బాధితులు కాదు. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కి ఫోన్ చేయాలి లేదా స్థానిక పోలీసులను ఆశ్రయించాలి.

Also Read: CBSE Re-evaluation: తగ్గిన 24 మార్కులు.. రీవాల్యుయేషన్‌తో 500/500