Varanasi’s Death Hotels: కాశీకి వెళ్తే మోక్షం వస్తుందని మనం చిన్నప్పటి నుండి వింటున్నాం. అందుకే చాలామంది ముసలివాళ్ళు తమ ఆఖరి రోజులను కాశీలోనే గడపాలని అనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసమే వారణాసిలో కొన్ని ప్రత్యేక లాడ్జ్ లు ఉన్నాయి. సోషల్ మీడియాలో వీటినే “డెత్ హోటల్స్(Varanasi’s Death Hotels)” అని పిలుస్తున్నారు.
అసలు అక్కడ ఏం జరుగుతుంది?
బయట వినడానికి “చావు హోటల్” అంటే భయంకరంగా అనిపిస్తుంది కదా? కానీ అక్కడ అలాంటి భయంకరమైనదేం జరగదు. జీవితం మీద ఆశ వదిలేసిన వాళ్లు, పెద్ద వయసు వచ్చి ఇక ఇంట్లో ఉండలేని వాళ్లు, జబ్బుతో బాధపడే వాళ్లు తమ చివరి రోజులను గంగ ఒడ్డున గడపడానికి అక్కడికి వస్తారు.
అక్కడ రూమ్ అద్దె ఎంతో తెలుసా? రోజుకి కేవలం 20 రూపాయల నుండి 100 రూపాయల లోపే! తినడానికి పప్పన్నం, ఉండటానికి ఒక చిన్న గది, స్నానానికి నీళ్లు – అంతే ఉంటుంది. 5 స్టార్ సౌకర్యాలు ఏమీ ఉండవు.
ఎందుకు వస్తారు?
వాళ్ళ కోరిక ఒక్కటే – కాశీలోనే ప్రాణం పోవాలి, తమ చితాభస్మాన్ని గంగలో కలపాలి. అలా చేస్తే తమకు మోక్షం వస్తుందని వాళ్ళ బలమైన నమ్మకం. అందుకే ఎవరో వచ్చి వాళ్ళని చేర్చరు, వాళ్లే స్వయంగా వస్తారు. కొందరు 10 రోజులు ఉంటారు, కొందరు నెలల తరబడి ఉంటారు.
వాళ్లు చనిపోయాక అక్కడి మేనేజర్లే వాళ్ల కుటుంబానికి ఫోన్ చేసి, కాశీ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేస్తారు.

సోషల్ మీడియా చెప్పేది నిజమా?
ఇన్స్టాలో చూపిస్తున్నట్లు ఇదేదో చంపే హోటల్ కాదు. ఇది ఒక ఆశ్రమం లాంటిది. చివరి కోరిక తీర్చుకోవడానికి వచ్చే భక్తులకు ఇచ్చే చిన్న ఆశ్రయం. దీన్ని వ్యాపారంగా కంటే సేవగా చూస్తారు అక్కడి వాళ్లు.
కాశీ అంటేనే వింతలకు నిలయం. బతికున్నప్పుడే చావు కోసం రూమ్ బుక్ చేసుకోవడం అనేది అక్కడ మాత్రమే జరుగుతుంది.
Also Read: Itchy Palms: అరచేతుల్లో దురద.. అలెర్జీనా? లేక ఆరోగ్య సమస్యా?
