Gujarat Viral Well: గుజరాత్ లోని మోర్బీ జిల్లాలో ఒక వింత జరిగింది. ఒక బావిలో నీరు ఆగకుండా అలల్లా(Gujarat Viral Well) కదులుతూనే ఉంది. ఎవరో కింద నుండి ఊపుతున్నట్లు, ఉడుకుతున్నట్లు కనిపిస్తోంది. దీని వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన జనం “ఏదో జరగబోతోంది, భూకంపం రాబోతోందా?” అని భయపడుతున్నారు.

అసలు నిజం ఏంటి?
వెంటనే అధికారులు అక్కడికి వెళ్లి చూశారు. ఇది భూకంపం కాదని తేల్చారు.
మరి ఎందుకు కదులుతోంది?
అధికారులు చెప్పిన దాని ప్రకారం, ఈ మధ్య గుజరాత్ లో భారీ వర్షాలు పడ్డాయి కదా. ఆ నీరంతా భూమిలోపలికి వెళ్లిపోయింది. భూమి లోపల రాళ్ల మధ్యలో ఉండే గాలి బయటకు రావడానికి ట్రై చేస్తోంది. ఆ గాలి బుడగలు బుడగలుగా పైకి వస్తుండటంతో బావిలో నీరు అలా కదులుతోంది.
Well water oscillate non stop in Gujarat. Whyy ?
This is called well seiche
Imagine you have a bucket filled with water. If you suddenly shake the bucket once, the water moves left to right → left → right for some time before becoming still.
Now imagine the Earth itself is… pic.twitter.com/d26u8mgnPv
— Madhu sudhan Reddy Pakala (@MSRPakala) August 7, 2026
దీన్ని సైన్స్ లో “బావి ఊపుడు” లాంటిదని అంటారు. చాలా అరుదుగా జరుగుతుంది. వర్షాలు ఎక్కువ పడినప్పుడే ఇలా అవుతుంది. గాంధీనగర్ లోని భూకంప కేంద్రం కూడా “అక్కడ ఎలాంటి భూకంపం రాలేదు, జనం భయపడొద్దు” అని చెప్పింది.
అయినా సరే, జనం మాత్రం ఆ వీడియో చూసి షాక్ అవుతున్నారు. బావి నీరు అలా కదలడం ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. పూర్తిగా తెలుసుకోవడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక టీంను కూడా పంపుతోంది.
Also Read:SIR Deadline: తెలంగాణలో ఓటర్లకు బిగ్ అలర్ట్! ఇంకో 3 రోజులే ఛాన్స్, లేకపోతే ఓటు గోవిందా!
