EMI Smartphones: ఈఎంఐ మీద ఫోన్ కొన్నారా.. కొత్త రూల్స్ ఇవే

EMI Smartphones: RBI's New Rules

EMI Smartphones:EMI లో ఫోన్, ల్యాప్టాప్ కొన్న వాళ్లకు RBI Big Update ఇచ్చింది. ఇక నుండి EMI కట్టకపోతే మీ ఫోన్ ని కంపెనీ వాళ్లే లాక్ చేసేస్తారు. అయితే ఇందులోనే ఒక ట్విస్ట్ ఉంది. మీరు ఫోన్ EMI కడుతుంటేనే ఈ రూల్ వర్తిస్తుంది. మీరు వేరే ఏదైనా Personal Loan తీసుకుంటే దాని కోసం మీ ఫోన్ లాక్ చేయడానికి వీల్లేదు.

ఎప్పుడు లాక్ చేస్తారు?

వెంటనే చేయరు.

* 30 రోజులు EMI కట్టకపోతే – ఫోన్ మీద కొన్ని ఆంక్షలు పెడతారు.

* 60 రోజులు దాటినా కట్టకపోతే – పూర్తిగా ఫోన్ లాక్ చేసేస్తారు.

Can Banks Lock Your Phone if You Miss an EMI? RBI Introduces New Rules for Financed Device

లాక్ చేసినా ఇవి మాత్రం పనిచేయాల్సిందే!

RBI చెప్పిన ప్రకారం, ఫోన్ లాక్ చేసినా కూడా ఈ 4 మాత్రం ఆపకూడదు:

1. ఇతరుల నుండి వచ్చే కాల్స్

2. SMS లు

3. SOS / ఎమర్జెన్సీ కాల్స్

4. మీ ఉద్యోగానికి సంబంధించిన ముఖ్యమైన యాప్స్

అన్నిటికంటే ముఖ్యమైన విషయం – వాళ్లు మీ ఫోన్ లోని ఫోటోలు, కాంటాక్ట్స్, వీడియోలు చూడకూడదు. అది పూర్తిగా బ్యాన్.

RBI mulls allowing lenders to lock phones if EMIs are missed; here's what governor said

కట్టగానే వెంటనే ఓపెన్ చేయాలి!

మీరు బకాయి మొత్తం కట్టిన గంటలోపే ఫోన్ మళ్లీ ఓపెన్ చేయాలి. ఒకవేళ చేయకపోతే ప్రతి గంటకు రూ. 250 చొప్పున వాళ్లే మీకు ఫైన్ కట్టాలి. ఈ కొత్త రూల్స్ 2027 జనవరి 1 నుండి అమల్లోకి రానున్నాయి. కాబట్టి EMI మీద ఫోన్ ఉన్నవాళ్లు జాగ్రత్త! టైంకి కట్టకపోతే చేతిలో ఫోన్ ఉన్నా డబ్బా అవుతుంది!

Also Read: Telangana Shocker: ‘నా మొగుడిని బయట యాక్సిడెంట్ చేయించి చంపెయ్..’ భార్య షాకింగ్ మెసేజ్!