Monalisa: ఇదేం ట్విస్ట్ రా నాయనా.. మోనాలిసా మిస్సింగ్..!

Monalisa Marriage Row – Husband Claims She's Missing, Mother Terms It Drama

Monalisa Marriage Row – Husband Claims She's Missing, Mother Terms It Drama

Monalisa: కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ కనిపించిన మోనాలిసా సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయి సెన్సేషన్‌గా మారిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు రావడంతో, కొద్ది రోజుల్లోనే ఆమె జీవితం పెద్ద మలుపు తీసుకుంది. హిందీలో సినిమాలు చేస్తుండగానే, కేరళకు చెందిన ఫర్మాన్ ఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

అయితే, ఈ పెళ్లి మొదటి నుంచే వివాదాలకు కారణమైంది. మోనాలిసా తల్లిదండ్రులు, బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా ఈ వివాహంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది లవ్ జిహాద్ అని కూడా ఆరోపించారు. మరోవైపు, పెళ్లి సమయంలో మోనాలిసా వయసు కేవలం 16 సంవత్సరాలే అని బయటపడటంతో, ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో చట్టం కింద మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) విచారణలో కూడా ఆమె మైనర్ అని తేలింది.

ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మోనాలిసా కనిపించడం లేదనే వార్త వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌లోని అజ్మేర్, పుష్కర్ ప్రాంతాలకు వెళ్లిన సమయంలో ఆమె అదృశ్యమైందని ఫర్మాన్ ఖాన్ తెలిపాడు. ఒక వీడియోలో “మోనాలిసా కనిపించడం లేదు… అజ్మేర్ అంతా వెతికాను, ఇప్పుడు జోధ్‌పూర్‌కు వెళ్తున్నాను” అంటూ అతను ఆందోళన వ్యక్తం చేశాడు.

అయితే, ఈ అదృశ్యం వెనుక అనుమానాస్పద అంశాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు, మోనాలిసా తల్లిదండ్రులు ఫర్మాన్ ఖాన్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తమ కుమార్తె కనిపించకుండా పోవడంలో అతనికి సంబంధం ఉందని, పోలీసుల విచారణ నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి నాటకాలు ఆడుతున్నాడని వారు ఆరోపిస్తున్నారు. గత 15-20 రోజులుగా తమ కుమార్తెతో మాట్లాడనివ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Bollywood News (@bollywoodblock_)

Also Read: XChat: వాట్సాప్ కు పోటీగా ఎక్స్ చాట్.. ఫీచర్లు ఇవే..!

Monalisa: ఇదేం ట్విస్ట్ రా నాయనా.. మోనాలిసా మిస్సింగ్..!