Boat Capsizes: అండమాన్‌ వద్ద పడవ బోల్తా.. 250 మంది గల్లంతు

About 250 people feared missing as boat capsizes in Andaman Sea: UN

About 250 people feared missing as boat capsizes in Andaman Sea: UN

Boat Capsizes: అండమాన్ సముద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న ఓ పడవ మునిగిపోవడంతో దాదాపు 250 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వారి కోసం సముద్రంలో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ ప్రమాదంపై ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్ (UNHCR), ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. ఆ ప్రకటన ప్రకారం, ఈ పడవ దక్షిణ బంగ్లాదేశ్ నుంచి మలేసియా వైపు ప్రయాణం ప్రారంభించింది.

ప్రయాణ సమయంలో బలమైన ఈదురుగాలులు, ఎత్తైన కెరటాల కారణంగా పడవ అదుపు తప్పి మునిగిపోయిందని అధికారులు తెలిపారు. అలాగే, పడవలో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం కూడా ఈ ప్రమాదానికి ఒక కారణంగా భావిస్తున్నారు.

ఈ ఘటనపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. గల్లంతైన వారిని కనుగొనేందుకు రక్షణ బృందాలు శక్తివంచన లేకుండా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.

Also Read: Trump Tower: పిచ్చి పీక్స్.. చందమామపై ‘ట్రంప్ టవర్’

Boat Capsizes: అండమాన్‌ వద్ద పడవ బోల్తా.. 250 మంది గల్లంతు