Shakeela: ఒకప్పుడు తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి షకీలా.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఒక దశలో బీ గ్రేడ్(B-Grade) సినిమాల్లో నటిస్తూ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉండేది. అయితే తాజాగా షకీలా(Shakeela) ఆరోగ్యానికి సంబంధించిన ఓ విషయం వెలుగులోకి వచ్చింది. ఎక్కువసేపు స్మార్ట్ఫోన్(Smart Phone) వాడటం వల్ల మెడకు తీవ్ర సమస్య రావడంతో ఆమె ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది.
షకీలాకు ఇటీవల మెడకు శస్త్రచికిత్స జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె మెడకు పట్టీ ధరించి కనిపిస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతున్నాయి. ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో కూడా ఆమెకు ఇతరులు సహాయం చేయాల్సి వచ్చింది.
![]()
తన ఆరోగ్య పరిస్థితికి అసలు కారణం ఏంటో షకీలా స్వయంగా వివరించారు. తాను రోజులో చాలా గంటల పాటు ఫోన్ ఉపయోగించేదానినని చెప్పారు. ముఖ్యంగా మంచంపై పడుకుని వరుసగా నాలుగు గంటల వరకు ఫోన్లో గేమ్స్(Games) ఆడేదానినని తెలిపారు. మధ్యలో టీ లేదా కాఫీ తాగడానికి మాత్రమే లేచి.. మళ్లీ ఫోన్ పట్టుకునేదానినని చెప్పారు.
Also Read: Dhanush Politics: ధనుష్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం..! లేటెస్ట్ అప్డేట్ ఇదే!
గేమ్స్ ఆడటంతో పాటు యూట్యూబ్(Youtube), ఇన్స్టాగ్రామ్(Instagram)లో రీల్స్ చూడటానికి కూడా చాలా సమయం కేటాయించేదానినని షకీలా వెల్లడించారు. ఇలా గంటల తరబడి ఒకే భంగిమలో ఫోన్ చూడటం వల్ల తన మెడపై తీవ్ర ఒత్తిడి పడిందని, చివరకు మెడకు సంబంధించిన నరాల సమస్యతో శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె తన అభిమానులకు, ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులకు కీలక సూచనలు చేశారు. పిల్లలకు మొబైల్ ఫోన్లు ఎక్కువగా ఇవ్వకూడదని, పెద్దలు కూడా ఫోన్ వినియోగాన్ని నియంత్రించుకోవాలని కోరారు. ఫోన్లో గంటల తరబడి గేమ్స్ ఆడటం, రీల్స్ చూడటం కాకుండా అవసరమైన సమాచారాన్ని మాత్రమే ఉపయోగించుకోవాలని సూచించారు.
షకీలా చెప్పిన వివరాల ప్రకారం.. ఈ చికిత్స కోసం దాదాపు రూ.3 లక్షల వరకు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. అయితే ఫోన్ వాడటం ఒక్కటే మెడ సమస్యకు కారణమని ఖచ్చితంగా చెప్పలేం. ఎక్కువసేపు ఫోన్ ఉపయోగించడం, తప్పు భంగిమలో కూర్చోవడం లేదా పడుకోవడం వల్ల మెడపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. మెడ నొప్పి, చేతుల్లో తిమ్మిరి వంటి సమస్యలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం మంచిది.
Also Read: Samantha: రూ.1.16 లక్షల చీర, బ్లౌజ్లో సమంత.. ఈ లుక్ వెనుక ఇంత కథ ఉందా?
