Rapido: రాపిడో బైక్‌ నుంచి దూకిన యువతి!

Delhi Woman Jumps Off Moving Rapido Bike

Rapido: ఢిల్లీలో ఓ మహిళా ప్రయాణికురాలు రాపిడో(Rapido) బైక్ డ్రైవర్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఆఫీసుకు వెళ్తుండగా డ్రైవర్ తనను తెలియని దారిలోకి తీసుకెళ్లాడని చెప్పింది. ఆపమని కోరినా పట్టించుకోలేదని తెలిపింది. దీంతో కదులుతున్న బైక్‌ నుంచి దూకాల్సి వచ్చిందని ఆయేషా శ్రీవాస్తవ్ ఆనే మహిళ ఆరోపించింది. ఈ ఘటనతో ఆమె గాయాలపాలైంది. ఈ వార్త సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో రాపిడో స్పందించి డ్రైవర్‌ను శాశ్వతంగా తొలగించింది.

ఢిల్లీలో రాపిడో బైక్‌ సర్వీస్‌ను ఉపయోగించిన ఓ మహిళకు ఊహించని అనుభవం ఎదురైంది. ఆయేషా శ్రీవాస్తవ్ అనే మహిళ తన ఆఫీసుకు వెళ్లేందుకు రాపిడో బైక్‌ను బుక్ చేసుకుంది. అయితే రైడ్ మధ్యలో డ్రైవర్ తనను నిర్మానుష్యమైన ప్రదేశంలా అనిపించే మార్గంలోకి తీసుకెళ్లాడని ఆమె ఆరోపించింది.

‘Fearing for my safety’: Delhi woman jumps from moving Rapido bike, suffers injuries | Viral

ఆ మార్గం యూనివర్సిటీకి నేరుగా వెళ్తుందని ఆ యువతికి డ్రైవర్ కి చెప్పింది. వేరే రూట్ లో వెళ్లమని చెప్పింది. లేదంటే కనీసం బైక్‌ను పక్కకు ఆపమనైనా కోరినట్లు ఆయేషా తెలిపింది. అయినప్పటికీ డ్రైవర్ తన మాటలను పట్టించుకోలేదని పేర్కొంది. దీంతో భయపడిన ఆమె కదులుతున్న బైక్‌ నుంచి దూకాల్సి వచ్చిందని, ఫలితంగా గాయపడినట్లు వెల్లడించింది.

రాపిడో కస్టమర్ సపోర్ట్

ఈ ఘటనపై రాపిడో కస్టమర్ సపోర్ట్ నుంచి సకాలంలో స్పందన రాలేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ తర్వాత తనకు ఎదుర్కొన్న అనుభవాన్ని సోషల్ మీడియాలో వీడియో రూపంలో పంచుకుంది. డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. మహిళల భద్రతపై మరింత జాగ్రత్త అవసరమని పలువురు కామెంట్లు చేశారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరికొందరు కోరారు.

రాపిడో స్పందన

ఈ వ్యవహారంపై రాపిడో స్పందించింది. ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపిన సంస్థ.. సంబంధిత డ్రైవర్‌ను తమ ప్లాట్‌ఫామ్‌ నుంచి శాశ్వతంగా తొలగించినట్లు వెల్లడించింది. చట్టపరమైన చర్యలకు అవసరమైన డ్రైవర్ వివరాలను ఆయేషాతో పంచుకున్నామని, అవసరమైతే వైద్య, చట్టపరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది.

Akso Read: Brave Woman: నీ ధైర్యానికి సలామ్.. హెల్మెట్‌తో చిరుతను తరిమిన యువతి