Maharashtra: మహారాష్ట్రలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు పలువురు బాలికలను మోసం చేసి లైంగికంగా వేధించడంతో పాటు, వందల సంఖ్యలో అశ్లీల వీడియోలు చిత్రీకరించిన కేసులో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం, పరాత్వడ నగరానికి చెందిన మహమ్మద్ అయాజ్ అలియాస్ తన్వీర్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో బాలికలను నమ్మబలికేవాడు. తరువాత మాయమాటలు చెప్పి వారిని ముంబయి, పూణే వంటి నగరాలకు తీసుకెళ్లి అశ్లీల వీడియోలు చిత్రీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వీడియోలను ఉపయోగించి వారిని బ్లాక్మెయిల్ చేయడమే కాకుండా, కొన్ని వీడియోలను ఆన్లైన్లో కూడా షేర్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ విషయం ఒక వినతిపత్రం ద్వారా రాజ్యసభ ఎంపీ అనిల్ బోండే దృష్టికి వచ్చింది. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయాలని, లేకపోతే నిరసనలకు దిగుతానని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడిని ఏడు రోజుల పోలీస్ కస్టడీకి పంపింది. నిందితుడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, అందులో వందలకొద్దీ అసభ్య వీడియోలు ఉన్నట్లు గుర్తించారు.
ఇప్పుడు ఆ వీడియోలు మరెవరికి పంపించాడా అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. సైబర్ సెల్ సహాయంతో ఆన్లైన్లో షేర్ అయిన వీడియోలను తొలగించే చర్యలు కూడా చేపట్టారు.
