TET Notification: తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

TG TET notification 2026

TG TET notification 2026

TET Notification: తెలంగాణలో నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు విద్యాశాఖ శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాదిలో ఇది రెండో టెట్ నోటిఫికేషన్ కావడం విశేషం. డీఎస్సీ (DSC) కోసం సిద్ధమవుతున్న వేలాది మంది అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా మారింది.

తాజా షెడ్యూల్ ప్రకారం, ఏప్రిల్ 15 నుంచి 30 వరకు అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. సమయం తక్కువగా ఉండటంతో, అభ్యర్థులు ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యాక, జూన్ నెలలో టెట్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. పరీక్షా కేంద్రాల ఏర్పాటు, హాల్ టికెట్ల జారీ, ఇతర సాంకేతిక ఏర్పాట్లపై విద్యాశాఖ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది.

ఈ నేపథ్యంలో, అభ్యర్థులు సిలబస్‌ను పూర్తిగా పరిశీలించి, జూన్‌లో జరగనున్న పరీక్షలకు ముందుగానే సిద్ధం కావాలని విద్యా నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: Monalisa: ఇదేం ట్విస్ట్ రా నాయనా.. మోనాలిసా మిస్సింగ్..!

TET Notification: తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల