HDFC Bank: ఏంటీ ఇది నిజమేనా.. క్రెడిట్ కార్డ్ బిల్లులో కేవలం కొన్ని పైసలు తక్కువగా చెల్లించినందుకు భారీ ఛార్జీలు విధించారా? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఘటనపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. డాక్టర్ సమీర్ కగల్కర్ అనే HDFC బ్యాంక్(HDFC Bank) క్రెడిట్ కార్డ్ కస్టమర్ తనకు ఎదురైన అనుభవాన్ని Xలో పంచుకున్నారు.
తన క్రెడిట్ కార్డ్ బిల్లు రూ.10,649.46 కాగా.. తాను రూ.10,649 మాత్రమే చెల్లించినట్లు ఆయన తెలిపారు. అంటే కేవలం 46 పైసలు మాత్రమే బకాయి ఉంచారు. అయితే ఆ తర్వాత తన ఖాతాలో రూ.1,200కు పైగా ఆలస్య రుసుములు, ఇతర ఛార్జీలు కనిపించాయని కగల్కర్ పేర్కొన్నారు. దీనిపై ఆయన బ్యాంకు కస్టమర్ సర్వీస్‌ను సంప్రదించి ఛార్జీలను వెనక్కి తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఈ సంభాషణకు సంబంధించిన రిఫరెన్స్ నంబర్‌ను కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ ఘటన నేపథ్యంలో క్రెడిట్ కార్డ్ బిల్లును పూర్తిగా చెల్లించకపోతే ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.. గడువు తేదీలోగా చెల్లించాల్సిన మొత్తం పూర్తిగా చెల్లించకపోతే కార్డుదారుడు వడ్డీ రహిత క్రెడిట్ వ్యవధిని కోల్పోవచ్చు. అయితే ఆలస్య చెల్లింపు రుసుములు, వడ్డీకి వేర్వేరు నిబంధనలు ఉంటాయి.
RBI మార్గదర్శకాల ప్రకారం, ఖాతా మూడు రోజుల కంటే ఎక్కువ గడువు దాటిన తర్వాతే దాన్ని ‘ఓవర్‌డ్యూ’గా పరిగణించి, వర్తించే నిబంధనల మేరకు ఆలస్య చెల్లింపు రుసుము విధించవచ్చు. అలాగే అలాంటి రుసుములను గడువు తేదీ తర్వాత బకాయి ఉన్న మొత్తంపైనే విధించాలి.. మొత్తం బకాయి మొత్తంపై కాదు.
అయితే కొన్ని పైసలు లేదా స్వల్ప మొత్తం చెల్లించకుండా మిగిలితే ప్రతి సందర్భంలోనూ ఆటోమేటిక్‌గా భారీ ఛార్జీలు పడతాయని చెప్పలేం. కార్డు జారీ చేసే బ్యాంకు నిబంధనలు, వర్తించే పరిమితులపై ఇది ఆధారపడి ఉంటుంది. ఫైనాన్స్ ఛార్జీలు, ఆలస్య చెల్లింపు రుసుములు కూడా ఒకటే కావు.
అందుకే క్రెడిట్ కార్డ్ వినియోగదారులు బిల్లులో ‘టోటల్ అమౌంట్ డ్యూ’, ‘మినిమమ్ అమౌంట్ డ్యూ’, బకాయి మొత్తం వంటి వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి. తదుపరి స్టేట్‌మెంట్‌లో వడ్డీ, ఆలస్య రుసుము, పన్నులు వంటి ఛార్జీల విభజనను కూడా చెక్ చేయడం మంచిది.
Dear HDFC Bank. @HDFC_Bank
You sent me a credit card bill for INR 10,649 – 46 (paise)
By error – I paid INR 10,649/-00 (missing out 46 paise)And you have slapped me with over INR 1200/- late payment charges etc for miss of 46 PAISE??
And your customer service people are as…
— Dr Samir Kagalkar (@SamirKagalkar) August 18, 2026
Also Read: Telangana Folk: రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఫేమస్ ఫోక్ ఆర్టిస్టులు
