Police Jobs: ఖాకీ డ్రెస్ వేసుకోవడం, సమాజానికి సేవ చేయడం మీ కలా..? పోలీస్ ఉద్యోగం(Police Jobs) అంటే చాలా మంది కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదు. అదొక బాధ్యత, గౌరవం. దాన్ని చేజిక్కించుకునేందుకు యువత ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. ఆ జాబులకు నోటిఫికేషన్ పడగానే.. క్షణం కూడా ఆలస్యం చేయరు. లక్షలాది మంది ఆ కఠినమైన పోటీని తట్టుకుని సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) లేదా కానిస్టేబుల్ ఉద్యోగం సాధించేందుకు అహర్నిషలూ కష్టపడతారు. కానీ ఆ కల నెరవేరాలంటే కేవలం చదివితేనే సరిపోదు. అందుకు సరాన ప్రణాళిక, శారీరక దృఢత్వం చాలా అవసరం. వీటితో పాటు పోలీస్ ఉద్యోగార్థులు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం!

1. సిలబస్, పరీక్షా సరళిపై స్పష్టత (Syllabus & Exam Pattern)
ప్రిపరేషన్ ప్రారంభించే ముందే రాత పరీక్ష (Written Exam) సిలబస్, ఈవెంట్స్ (Physical Events) విధానంపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.
-
అరిథ్‌మెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ (GS), తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ చరిత్ర, వర్తమాన అంశాలు (Current Affairs) వంటి విభాగాలకు కేటాయించే మార్కుల ఆధారంగా ప్రాధాన్యత ఇవ్వాలి.
2. ఫిజికల్ ఫిట్‌నెస్ నిత్య సాధన (Physical Training)
చాలామంది రాత పరీక్ష పూర్తయ్యాక ఈవెంట్స్ కోసం ప్రాక్టీస్ మొదలుపెడతారు. కానీ ఇది చాలా పెద్ద పొరపాటు.
-
లాంగ్ రన్ & రన్నింగ్: ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం రన్నింగ్, లాంగ్ జంప్, షాట్‌పుట్ వంటి ఈవెంట్లను క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి.
-
ఆరోగ్యకరమైన ఆహారం: శారీరక శ్రమకు తగ్గట్టుగా ప్రోటీన్ కలిగిన ఆహారం తీసుకోవాలి. సరైన నిద్ర, ఉత్సాహం ఉండేలా చూసుకోవాలి.

3. టైమ్ టేబుల్, రివిజన్ (Time Table & Revision)
-
రోజులో కనీసం 8 నుండి 10 గంటలు చదవడానికి కేటాయించాలి.
-
చదివిన విషయాలను ఎప్పటికప్పుడు నోట్స్ రాసుకోవడం వల్ల పరీక్ష ముందు రివిజన్ చేయడం చాలా తేలికవుతుంది.
-
గణితం, రీజనింగ్ విభాగాల్లో వేగం (Speed) పెంచుకోవడానికి రోజూ షార్ట్‌కట్ మెథడ్స్ ప్రాక్టీస్ చేయాలి.
4. ప్రీవియస్ పేపర్లు & మాక్ టెస్టులు (Previous Papers & Mock Tests)
-
గత సంవత్సరాల క్వశ్చన్ పేపర్లను (Previous Year Papers) సాధించడం వల్ల ప్రశ్నలు అడిగే సరళి అర్థమవుతుంది.
-
ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ మాక్ టెస్టులు రాయడం వల్ల సమయ నిర్వహణ (Time Management) మెరుగవుతుంది. మీ బలహీనతలను తెలుసుకుని సరిదిద్దుకోవచ్చు.
పోలీస్ ఉద్యోగ సాధనలో ఓర్పు, క్రమశిక్షణ, నిలకడ (Consistency) అత్యంత కీలకమైనవి. రాత పరీక్షతో పాటు ఫిజికల్ ఈవెంట్స్‌పై సమాన దృష్టి పెట్టి, ఆత్మవిశ్వాసంతో శ్రమిస్తే మీ ఖాకీ కల ఖచ్చితంగా నెరవేరుతుంది.
Also Read: 6 Guarantees: రేవంత్ ఇలాకాలో 6 పథకాలు.. పెండింగ్ లో ఉన్న హామీలివే
