End of Life: మనిషి చనిపోయే ముందు కనిపించే లక్షణాలు ఇవే..!

End of Life Signs

End of Life: పుట్టిన ప్రతి మనిషి చావక తప్పదు. జీవితంలో పుట్టుక ఎంత నిజమో, మరణం కూడా అంతే నిజం. వయోభారం వల్లనో, అనారోగ్యం వల్లనో, మరే కారణం వల్లనో మనిషి జీవిత చరమాంకానికి(End of Life) చేరుకోవచ్చు. అందుకు కొన్ని క్షణాల ముందు శరీరం కొన్ని స్పష్టమైన సంకేతాలను ఇస్తుంది. వైద్య పరిభాషలో దీన్ని “ఎండ్ ఆఫ్ లైఫ్ చేంజెస్” (End of Life Changes) అని పిలుస్తారు. వ్యక్తి చివరి రోజుల్లో లేదా గంటల్లో ఉన్నప్పుడు వారి శరీరంలో అనేక శారీరక, మానసిక మార్పులు చోటుచేసుకుంటాయి. కుటుంబ సభ్యులకు ఈ సంకేతాల పట్ల ఏమాత్రం అవగాహన ఉన్నా ఆ వ్యక్తి చివరి క్షణాల్లో వారికి ఓదార్పు, కాస్త ఉపశమనాన్ని, సంతోషాన్ని అందించడానికి వీలవుతుంది. నిపుణుల ప్రకారం మరణానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే..

Mottled Skin Before Death: What Is It?

1. ఆహారం, నీటిపై ఆసక్తి తగ్గడం (Loss of Appetite)

మరణానికి కొన్ని రోజుల ముందు శరీరం తన శక్తి వినియోగాన్ని తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ నెమ్మదించడం వల్ల వ్యక్తికి ఆకలి, దప్పిక కావు. ఆహారం లేదా నీటిని మింగడం కష్టంగా మారుతుంది.

2. విపరీతమైన అలసట, నిద్ర (Extreme Fatigue and Sleep)

శరీరంలో అవయవాల పనితీరు తగ్గుతుంది. క్రమంగా శక్తి తగ్గుతుంది. దీనివల్ల వ్యక్తి రోజంతా నిద్రపోవడానికే మొగ్గు చూపుతారు. స్పృహ లేకపోవటం, చుట్టూ ఉన్నవారిని గుర్తుపట్టకపోవడం లేదా పిలిచినా స్పందించకపోవడం జరుగుతుంది.

3. శ్వాసక్రియలో మార్పులు (Breathing Patterns)

చివరి దశలో శ్వాస తీసుకునే వేగం మారుతుంది.

  • చైన్-స్టోక్స్ శ్వాస (Cheyne-Stokes breathing): కొద్దిసేపు వేగంగా శ్వాస తీసుకోవడం, ఆ తర్వాత కొన్ని సెకన్ల పాటు శ్వాస అసలు ఆడకపోవడం వంటి మార్పులు వస్తాయి.

  • డెత్ రాటిల్ (Death Rattle): గొంతులో శ్లేష్మం (మురికి) పేరుకుపోవడం వల్ల శ్వాస తీసుకునేటప్పుడు విచిత్రమైన శబ్దం వస్తుంది.

The Emergency Physician and End-of-Life Care | Journal of Ethics | American Medical Association

4. శరీర ఉష్ణోగ్రత తగ్గడం, చర్మ రంగు మారడం (Changes in Skin & Temperature)

రక్తప్రసరణ తగ్గిపోవడం వల్ల కాళ్ళు, చేతులు చల్లబడతాయి. కాళ్లు, చేతుల చర్మంపై నీలం లేదా ఊదా రంగు మచ్చలు (Mottling) కనిపిస్తాయి. రక్తపోటు తీవ్రంగా పడిపోతుంది.

5. మూత్రం, మలం ఉత్పత్తి తగ్గడం (Reduced Elimination)

ఆహారం, నీరు తీసుకోకపోవడం, మూత్రపిండాల పనితీరు మందగించడం వల్ల మూత్రం చాలా ముదురు రంగులోకి మారడం లేదా అసలు రాకపోవడం జరుగుతుంది. ప్రేగులపై నియంత్రణ కూడా కోల్పోవచ్చు.

6. మానసిక మార్పులు & గందరగోళం (Confusion & Hallucinations)

మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గడం వల్ల వ్యక్తికి తీవ్రమైన గందరగోళం (Delirium) ఏర్పడుతుంది. చనిపోయిన బంధువులు కనిపిస్తున్నారని చెప్పడం లేదా వారితో మాట్లాడటం వంటి భ్రమలు (Hallucinations) కలుగవచ్చు.

జీవితపు చివరి దశలో ఉండే వ్యక్తికి వైద్య చికిత్స కంటే ప్రేమ, ఓదార్పు, ప్రశాంతమైన వాతావరణం ఎంతో అవసరం. ఈ సంకేతాలను ముందుగానే అర్థం చేసుకోవడం వల్ల చివరి నిమిషాల్లో వారికి ఎలాంటి నొప్పి లేకుండా, ప్రశాంతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లేందుకు మార్గం సమకూర్చవచ్చు.

Also Read: Police Jobs: పోలీస్ జాబ్ కొట్టాలంటే పక్కా ఇవి పాటించాల్సిందే!