XChat: ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X కోసం ప్రత్యేక చాట్ మెసెంజర్ యాప్ త్వరలో అందుబాటులోకి రానుంది. “XChat” అనే పేరుతో వస్తున్న ఈ యాప్ పూర్తిగా చాటింగ్ కోసం రూపొందించారు. గత ఏడాది నుంచి పరీక్షల దశలో ఉన్న ఈ అప్లికేషన్‌ను ఇప్పుడు అధికారికంగా విడుదల చేయడానికి కంపెనీ సిద్ధమైంది.
ఈ యాప్ లాంచ్‌ను ఆపిల్ కూడా తన ప్లాట్‌ఫామ్‌పై టీజ్ చేసింది. మొదటగా ఇది iOSలో, అంటే ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ 17న యాప్ స్టోర్‌లో విడుదల చేసి డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. డిజైన్ ప్రకారం, ఇందులో వెండి రంగులో చాట్ ఐకాన్ కనిపించనుంది.
XChatలో వినియోగదారులకు పలు ముఖ్యమైన ఫీచర్లు అందించబడతాయి. ముఖ్యంగా ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా మెసేజ్‌లు సురక్షితంగా ఉంటాయి. అలాగే స్క్రీన్‌షాట్ బ్లాకింగ్ ఫీచర్ ఉండటం వల్ల చాట్లను సులభంగా సేవ్ చేయలేరు. అదనంగా, పంపిన మెసేజ్‌లను ఎడిట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.
ఇంకా, ఈ యాప్‌లో వాయిస్, వీడియో కాలింగ్ సదుపాయం ఉంది. పెద్ద గ్రూప్ చాట్లను నిర్వహించడానికి కూడా మద్దతు ఇస్తుంది. అలాగే, మెసేజ్‌లు కొంతకాలం తర్వాత ఆటోమేటిక్‌గా మాయమయ్యే ఫీచర్ కూడా ఇందులో ఉంటుంది. అయితే, ఈ ఫీచర్లలో కొన్ని ఇప్పటికే X ప్లాట్ఫామ్లో కూడా అందుబాటులో ఉన్నాయి.
కంపెనీ ప్రకారం, “XChat వినియోగదారులకు ప్రైవేట్‌గా, ఎలాంటి ప్రకటనలు లేదా ట్రాకింగ్ లేకుండా సంభాషణ చేయడానికి ప్రత్యేకమైన వేదికను అందిస్తుంది. ఇందులోని మెసేజింగ్ పూర్తిగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది, అందువల్ల వినియోగదారుల గోప్యతకు పూర్తి రక్షణ ఉంటుంది” అని పేర్కొంది.
Your encrypted chats deserve their own app.
Pre-order now: https://t.co/TM8Lk7AMGV pic.twitter.com/ZJ3yROXK1t
— XChat (@chat) April 10, 2026
