Nolan Craze Peak: ఇదేం పిచ్చిరా నాయనా.. సినిమా కోసం ప్రెగ్నెన్సీ వాయిదా!😱

Nolan Craze Peak: Superfan Delays Pregnancy

Nolan Craze Peak: ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్(Nolan Craze Peak) సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తాజా చిత్రం ‘ది ఒడిస్సీ(The Odissi)’ గ్లోబల్‌గా విడుదలై థియేటర్లలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాను థియేటర్లలో, అదీ నోలన్(Nolan Craze Peak) ఆశించిన ఒరిజినల్ ‘IMAX 70mm’ ఫార్మాట్‌లో చూడటం కోసం అభిమానులు ఎంతటి సాహసానికైనా సిద్ధపడుతున్నారు. ఈ క్రేజ్ ఏ స్థాయికి చేరిందంటే… ఓ మహిళ ఏకంగా ఈ సినిమాను ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడటం కోసం తన ప్రెగ్నెన్సీనే వాయిదా వేసుకుంది!

Christopher Nolan fan delays pregnancy plans to watch The Odyssey on opening day - India Today

కాలిఫోర్నియా(Caulifornia)కు చెందిన ఆంబర్ కన్నగన్ అనే 29 ఏళ్ల నోలన్( సూపర్ ఫ్యాన్, తన రెండో బిడ్డను కనడానికి ప్లాన్ చేసుకునే సమయంలో ‘ది ఒడిస్సీ’ రిలీజ్ డేట్ (జులై 17, 2026) అడ్డు రాకూడదని భావించింది. ఒకవేళ ఆ సమయానికి డెలివరీ డేట్ వస్తే థియేటర్‌లో సినిమా చూడటం మిస్ అవుతుందనే భయంతో, ఆంబర్ తన ప్రెగ్నెన్సీని కొన్ని నెలల పాటు వెనక్కి జరుపుకుంది. కేవలం సినిమా ఓపెనింగ్ వీకెండ్‌ను ఫుల్ ఎనర్జీతో ఎంజాయ్ చేయడం కోసమే తను ఈ వింత నిర్ణయం తీసుకున్నట్లు స్వయంగా వెల్లడించింది.

Also Read: Earthquake: భూకంపం వచ్చే ముందు ప్రకృతి ఇచ్చే సంకేతాలు! 🚨 ఇవి తెలిస్తే ప్రాణాలు దక్కుతాయి!

Indian fans will miss The Odyssey's IMAX 70mm vision. What are the other options to watch biggest film of the year starring Matt Damon, Anne Hathaway, Zendaya, Tom Holland - The Economic

ఇక ఈ సినిమా పిచ్చి కేవలం ఆంబర్‌తోనే ఆగలేదు. పెన్సిల్వేనియాకు చెందిన టిమ్ మెక్‌హగ్ అనే మరో డైహార్డ్ ఫ్యాన్, ఈ చిత్రాన్ని ఒరిజినల్ 70MM ఐమాక్స్ స్క్రీన్‌పై అనుభవించడానికి ఏకంగా 3,904 కిలోమీటర్లు ప్రయాణించి లాస్ ఏంజిల్స్ వెళ్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 41 థియేటర్లలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ అరుదైన ఫిల్మ్ ప్రొజెక్షన్ కోసం వేలాది మంది అభిమానులు దేశాలు దాటి మరీ ప్రయాణాలు చేస్తున్నారు. నోలన్ విజువల్ మ్యాజిక్ కోసం ఫ్యాన్స్ చూపిస్తున్న ఈ స్థాయి అంకితభావం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: Tata EV Cars: టాటా EV కార్లు కొనాలనుకుంటున్నారా.. ఇదే మంచి ఛాన్స్..!