Twist in Vijay Divorce Case: విజయ్-సంగీత మళ్లీ ఒక్కటయ్యారా?

Vijay Gets Relief as Sangeetha Withdraws Divorce Petition

Twist in Vijay Divorce Case: తమిళనాడు రాజకీయ వర్గాల్లో, కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గత కొన్ని నెలలుగా హాట్ టాపిక్ గా మారిన సీఎం విజయ్ దంపతుల విడాకుల వ్యవహారం(Vijay Divorce Case) లో అతిపెద్ద ట్విస్ట్ చోటుచేసుకుంది.

తన భర్త, తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ నుండి విడాకులు కావాలంటూ చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో భార్య సంగీత సోర్నలింగం దాఖలు చేసిన పిటిషన్ ను ఆమె తాజాగా ఉపసంహరించుకున్నారు. దీంతో ఆ కేసును కోర్టు డిస్పోజ్ చేసింది. జాతీయ వార్తా సంస్థ ANI ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించడంతో ఈ వార్త ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఫిబ్రవరిలో ఏం జరిగింది?

గుర్తుందా? ఈ ఏడాది ఫిబ్రవరి 27న సంగీత కోర్టును ఆశ్రయించినప్పుడు ఎంత పెద్ద దుమారం రేగిందో. 27 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక బంధానికి సంగీత స్వయంగా ముగింపు పలకాలని నిర్ణయించుకోవడం అందరినీ షాక్ కు గురిచేసింది.

ఆ పిటిషన్ లో ఆమె చేసిన ఆరోపణలు చిన్నవి కావు..

* తన భర్త విజయ్ కి ప్రముఖ నటితో వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయం తనకు 2021 ఏప్రిల్ లోనే తెలిసిందని.

* దాన్ని ఆపేయమని ఎన్నిసార్లు బ్రతిమిలాడినా, హామీలు ఇచ్చినా చివరకు ఆ బంధాన్ని కొనసాగించారని.

* ఆ నటితో కలిసి విదేశీ టూర్లు, బహిరంగ కార్యక్రమాలకు వెళ్లడం, ఆ ఫోటోలను ఆ నటి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నా విజయ్ అడ్డుకోకపోవడం వల్ల తాను తీవ్ర మానసిక వేదన అనుభవించానని.

* ఈ వ్యవహారం వల్ల తానే కాదు, తమ ఇద్దరు పిల్లలు జాసన్ సంజయ్ (25), దివ్య సాషా (20) కూడా స్కూల్స్ లో, సోషల్ మీడియాలో అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని.

అంతేకాదు, తనకున్న కొన్ని ఆర్థిక సౌకర్యాలను నిలిపివేసి, కట్టడి చేశారని, తన స్వేచ్ఛను హరించారని కూడా ఆమె పిటిషన్ లో పేర్కొనడం సంచలనం రేపింది. తమ బంధం కేవలం చట్టపరంగానే మిగిలిందని, మనస్పర్థలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

నేడు విచారణ ఉండగా.. సడెన్ యూ-టర్న్! 

ఈ కేసు విచారణ జూన్ 15న జరిగినప్పుడు విజయ్, సంగీత ఇద్దరూ కోర్టుకు హాజరుకాలేదు. లాయర్లను మాత్రమే పంపారు. దీంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి, తదుపరి విచారణ అయిన ఆగస్టు 7న (అంటే నేడు) తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది.

అందరూ నేటి విచారణలో ఏం జరుగుతుందో అని ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా, సంగీత తరపు న్యాయవాది కోర్టులో పిటిషన్ ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడం అందరినీ షాక్ కు గురిచేసింది.

Actor-Politician Vijay's Wife Files for Divorce

అసలు ఎందుకు వెనక్కి తీసుకుంది? తెరవెనక ఏం జరిగింది?

ఇప్పుడు కోలీవుడ్ లో, తమిళ రాజకీయ వర్గాల్లో ఇదే పెద్ద చర్చ. దీని వెనక మూడు బలమైన కారణాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది:

1. పిల్లల కోసం రాజీ:

విజయ్, సంగీతల తనయుడు జాసన్ సంజయ్ ఇప్పుడిప్పుడే దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కూతురు దివ్య సాషా చదువుకుంటోంది. ఈ టైంలో తల్లిదండ్రుల విడాకులు వారి భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని ఇద్దరూ ఆలోచించి ఉండొచ్చు. ఇరు కుటుంబాల పెద్దలు రంగంలోకి దిగి రాజీ కుదిర్చారని అంటున్నారు.

2. రాజకీయ ఒత్తిడి:

విజయ్ ఇప్పుడు సాధారణ హీరో కాదు, తమిళనాడు ముఖ్యమంత్రి. TVK పార్టీని నడుపుతున్నారు. 2026 ఎన్నికల తర్వాత ఆయన ఇమేజ్ చాలా సెన్సిటివ్. ఈ టైంలో భార్యతో విడాకులు, వివాహేతర సంబంధం ఆరోపణలు పార్టీకి, ప్రభుత్వానికి పెద్ద మైనస్ అవుతాయని పార్టీ పెద్దలు సర్దిచెప్పి ఉండొచ్చు.

3. ఆ నటితో బ్రేకప్?:

సంగీత పిటిషన్ లో పేర్కొన్న ఆ నటితో విజయ్ బంధం తెగిపోయిందని, అందుకే సంగీత మనసు మార్చుకుని ఉండొచ్చని మరో వాదన కూడా ఉంది.

అయితే ఈ కారణాల్లో ఏది నిజమో తెలియాలంటే విజయ్ లేదా సంగీత అధికారికంగా స్పందించే వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికి కేసు క్లోజ్ అయింది, దళపతి ఫ్యామిలీ మళ్లీ ఒక్కటైందనే వార్త ఫ్యాన్స్ లో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.

Also Read: Shocking Moment: జస్ట్ మిస్.. రవీనా టాండన్ దుస్తులు లాగిన కుక్క