Temple: గుడి నుంచి రాగానే స్నానం చేస్తున్నారా..?

What NOT To Do After visiting temple

What NOT To Do After visiting temple

Temple: ముఖ్యంగా హిందూ ధర్మంలో భగవంతుని ఆరాధన, దేవాలయ ప్రవేశం, పూజలు, హోమ హవనాలకు సంబంధించిన కొన్ని నియమాలు, నిబంధనలు ఉన్నాయి. సాధారణంగా ప్రజలు దేవాలయానికి వెళ్లే ముందు తమ రోజువారీ పనులు పూర్తి చేసి, స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించడం ఆనవాయితీగా పాటిస్తారు. స్నానం చేయకుండా దేవాలయానికి వెళ్లకూడదని భావిస్తారు.

స్నానం చేయడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. అది శరీరాన్ని మాత్రమే కాకుండా మనసును కూడా పరిశుభ్రం చేస్తుంది. పరిశుభ్రమైన, ప్రశాంతమైన మనసుతో భగవంతుని ప్రార్థిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. అలాగే రాత్రి నిద్రలో మనలోకి కొన్ని ప్రతికూల ప్రభావాలు చేరుతాయని భావిస్తారు. అందుకే స్నానం చేసి దేవాలయానికి వెళితే ఆ ప్రతికూలతలు దూరమవుతాయని, మనసు ప్రశాంతంగా ఉంటుందని అంటారు.

దేవాలయానికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకుని, ప్రార్థనలు చేసి, ధ్యానం చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీతో తిరిగి ఇంటికి వస్తామని నమ్మకం. అయితే గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేయకూడదని శాస్త్రాలు సూచిస్తున్నాయి. అలాగే వెంటనే కాళ్లు కడగడం కూడా మంచిది కాదని అంటారు.

దీనికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. దేవాలయానికి వెళ్లి పొందిన పాజిటివ్ ఎనర్జీ వెంటనే స్నానం చేస్తే తగ్గిపోతుందని విశ్వాసం. భగవంతుని దర్శనంతో లభించే పుణ్యం కూడా పూర్తిగా పొందలేమని చెబుతారు. ప్రత్యేకంగా తలస్నానం చేస్తే ఈ ఫలితం తగ్గిపోతుందని అంటారు.

సాధారణంగా మనం అశుభ కార్యక్రమాల తర్వాత లేదా అపవిత్రమైన ప్రదేశాల నుంచి వచ్చినప్పుడు స్నానం చేస్తాము. ఉదాహరణకు మరణ గృహాన్ని సందర్శించిన తర్వాత శరీరానికి అంటుకున్న ప్రతికూల ప్రభావాలను తొలగించడానికి స్నానం చేస్తారు. అయితే దేవాలయం పవిత్ర స్థలం కాబట్టి అక్కడి నుంచి వచ్చి వెంటనే స్నానం చేయడం అనేది తగినది కాదని పండితులు పేర్కొంటున్నారు.

Also Read: Char Dham Yatra: తల్లిని భుజాన మోస్తూ.. కేదార్‌నాథ్ యాత్రకు

Temple: గుడి నుంచి రాగానే స్నానం చేస్తున్నారా..?