Reliance Jio: 10కిపైగా OTTల సబ్‌స్క్రిప్షన్స్‌తో జియో కొత్త ప్లాన్

Reliance Jio Mega Content Plan Rs 500 and New Add-On Pack Rs 200 Benefits Detailed

Reliance Jio Mega Content Plan Rs 500 and New Add-On Pack Rs 200 Benefits Detailed

Reliance Jio: రిలయన్స్ జియో వినియోగదారులను ఆకర్షించేందుకు బడ్జెట్ ఫ్రెండ్లీ రీచార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. ముఖ్యంగా ఐపీఎల్, ఎంటర్‌టైన్‌మెంట్‌ను దృష్టిలో పెట్టుకుని కొత్త ఆఫర్లను తీసుకొస్తోంది. తాజాగా 10కి పైగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లతో కూడిన “మెగా కంటెంట్” ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

రూ. 500 మెగా కంటెంట్ ప్లాన్

ఈ ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. మొత్తం 56GB డేటా లభిస్తుంది, అంటే రోజుకు 2GB హై-స్పీడ్ డేటా అందుతుంది. డేటా పూర్తయిన తర్వాత 64 Kbps వేగంతో ఇంటర్నెట్ కొనసాగుతుంది. మీ ప్రాంతంలో 5G అందుబాటులో ఉంటే అపరిమిత 5G డేటా కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే రోజుకు 100 SMSలు ఉచితంగా లభిస్తాయి.

ఈ ప్లాన్‌లో వినోదానికి సంబంధించిన అనేక సబ్‌స్క్రిప్షన్‌లు ఉన్నాయి. YouTube Premium, JioHotstar (హాట్ స్టార్), Amazon Prime Video Mobile Edition వంటి ప్లాట్‌ఫారమ్‌లతో పాటు 10కి పైగా OTT సేవలను JioTV ద్వారా వీక్షించవచ్చు. Sony LIV, ZEE5, Discovery+, Sun NXT, Planet Marathi, Chaupal వంటి యాప్‌లకు యాక్సెస్ లభిస్తుంది.

అదనంగా JioGames Mobile, JioCloud సేవలు కూడా ఈ ప్లాన్‌లో భాగం. 5000GB క్లౌడ్ స్టోరేజ్‌తో పాటు 18 నెలల Google Gemini Pro ప్లాన్‌ను కూడా జియో అందిస్తోంది.

రూ. 200 మెగా కంటెంట్ యాడ్-ఆన్ ప్లాన్

జియో మరోగా రూ. 200 విలువైన మెగా కంటెంట్ యాడ్-ఆన్ ప్లాన్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఇది 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఇందులో 5GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. ఆ తర్వాత 64 Kbps వేగంతో అపరిమిత డేటా ఉపయోగించుకోవచ్చు.

అయితే ఇది యాడ్-ఆన్ ప్లాన్ మాత్రమే కాబట్టి వాయిస్ కాల్స్, SMSలు లేదా ప్రధాన వాలిడిటీ ఇందులో ఉండవు. కానీ OTT సబ్‌స్క్రిప్షన్‌లతో కూడిన వినోద ప్రయోజనాలు ఇందులో కూడా లభిస్తాయి.

Also Read: Crime: కాబోయే భార్యను రూమ్‌కు పిలిచి.. వచ్చే లోపే..

Reliance Jio: 10కిపైగా OTTల సబ్‌స్క్రిప్షన్స్‌తో జియో కొత్త ప్లాన్