Crime: కాబోయే భార్యను రూమ్‌కు పిలిచి.. వచ్చే లోపే..

Gurugram man takes sex-enhancing drug before meeting fiancée, dies of overdose

Gurugram man takes sex-enhancing drug before meeting fiancée, dies of overdose

Crime: గురుగ్రామ్‌లోని సెక్టార్ 53 ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. లైంగిక సామర్థ్యాన్ని పెంచే మందును అధిక మోతాదులో తీసుకోవడం వల్ల 29 ఏళ్ల యువకుడు మరణించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన గదిలో కొన్ని మందుల ప్యాకెట్లు, ఆరోగ్య సప్లిమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

మృతుడు రోహిత్ లాల్‌గా గుర్తించారు. ఆయన నాగ్‌పూర్‌కు చెందినవారు కాగా, న్యూఢిల్లీలోని క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో పనిచేస్తూ, గురుగ్రామ్‌లో అద్దె ఫ్లాట్‌లో నివసిస్తున్నారు.

ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. లాల్ ఫోన్‌కు స్పందించకపోవడంతో, గది తలుపు కూడా తెరవకపోవడంతో అనుమానం వచ్చిన సహోద్యోగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇద్దరూ సాధారణంగా కలిసి ఆఫీసుకు వెళ్లేవారని సహోద్యోగి తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని తలుపు బద్దలుకొట్టి లోపలికి వెళ్లగా, లాల్ మంచంపై మృతదేహంగా పడి ఉండటం గమనించారు. గదిలోని కొన్ని మందులు, సప్లిమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రాథమిక దర్యాప్తులో, లాల్ తన కాబోయే భార్యను కలవడానికి ఆహ్వానించాడని, అయితే ఆమె రాకముందే ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ఆయన తీసుకున్న మందు అధిక మోతాదులో ఉండటం వల్ల గుండెపోటు వచ్చి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

పోస్ట్‌మార్టం పూర్తి చేసిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. “అంతర్గత అవయవాలను, స్వాధీనం చేసుకున్న మందులను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాం. నివేదికలు వచ్చిన తర్వాతే మరణానికి ఖచ్చితమైన కారణం తెలుస్తుంది. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది” అని సెక్టార్ 53 ఎస్‌హెచ్‌ఓ సతేందర్ రావల్ తెలిపారు.

Also Read: Raghav Chadha: బీజేపీలోకి రాఘవ్ చద్ధా.. తగ్గిన 10లక్షల ఫాలోవర్లు

Crime: కాబోయే భార్యను రూమ్‌కు పిలిచి.. వచ్చే లోపే..