AP Inter Results 2026: వాట్సప్‌లో ఒక్క మెసేజ్ తో.. సెకన్లలో రిజల్ట్స్

Andhra Pradesh Inter Result 2026 Link on WhatsApp

Andhra Pradesh Inter Result 2026 Link on WhatsApp

AP Inter Results 2026: తెలంగాణలో ఇప్పటికే ఇంటర్ ఫలితాలు విడుదల కాగా, ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఉదయం 10:31 గంటలకు ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ (X) వేదికగా వెల్లడించారు. ఒకేసారి ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు మొత్తం 10.50 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో ప్రథమ సంవత్సరం పరీక్షలు 5,31,275 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలు 5,26,264 మంది రాశారు. దీంతో లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రథమ సంవత్సర ఫలితాల్లో ఆరో సబ్జెక్టు మార్కులను విడిగా చూపించనున్నట్లు ఇంటర్ బోర్డు పేర్కొంది. ఉమ్మడి కృష్ణా జిల్లా (ప్రస్తుతం కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు) నుంచి సుమారు 1,02,000 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://results-bie.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే వాట్సప్ ద్వారా కూడా సులభంగా రిజల్ట్స్ చెక్ చేసుకునే సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. వాట్సప్ గవర్నెన్స్ సేవల భాగంగా “మన మిత్ర” ద్వారా ఫలితాలు పొందవచ్చని తెలిపింది.

వాట్సప్ ద్వారా ఫలితాలు తెలుసుకోవడం ఇలా:

  • 9552300009 నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపాలి
  • మెనూ వస్తుంది
  • అందులో “Select Service” ఎంపిక చేయాలి
  • “విద్యా సేవలు” పై క్లిక్ చేయాలి
  • “AP Inter Results 2026” ఎంపిక చేసుకోవాలి
  • హాల్ టికెట్ నెంబర్ నమోదు చేయాలి
  • వెంటనే మీ ఫలితాలు వాట్సప్‌లో కనిపిస్తాయి

వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు చూసే విధానం:

  • https://results-bie.ap.gov.in ఓపెన్ చేయాలి
  • ఇంటర్ ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్ ఎంపిక చేసుకోవాలి
  • హాల్ టికెట్ నెంబర్ నమోదు చేయాలి
  • ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి, అవసరమైతే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు మార్చి 23 వరకు జరిగాయి. మూల్యాంకనం పూర్తయ్యాక ఇప్పుడు ఫలితాలను విడుదల చేస్తున్నారు. దీంతో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది.

Also Read: Boat Capsizes: అండమాన్‌ వద్ద పడవ బోల్తా.. 250 మంది గల్లంతు

AP Inter Results 2026: వాట్సప్‌లో ఒక్క మెసేజ్ తో.. సెకన్లలో రిజల్ట్స్