SBI Asha Scholarship: పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఆర్థిక భరోసానిచ్చేందుకు SBI ఫౌండేషన్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకమే SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్‌షిప్ 2026 (SBI Asha Scholarship). 9వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న పాఠశాల విద్యార్థుల నుంచి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఐఐటీ (IIT), ఐఐఎమ్ (IIM), మెడికల్ (MBBS), విదేశీ విద్య (Overseas Studies) అభ్యసించే విద్యార్థులు సెప్టెంబర్ 4 వరకు దరఖాస్తు చేస్తోవచ్చు. దీని ప్రకారం కోర్సును బట్టి రూ. 15,000 నుండి రూ. 20 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది.

అర్హత నియమాలు (General Eligibility Criteria):
-
మార్కుల శాతం: కిందటి విద్యా సంవత్సరంలో కనీసం 75% మార్కులు (లేదా 7.0 CGPA) సాధించి ఉండాలి. (SC / ST అభ్యర్థులకు 10% మినహాయింపు ఉంటుంది — అంటే కనీసం 67.5% మార్కులు సరిపోతాయి).
-
కుటుంబ ఆదాయ పరిమితి:
-
పాఠశాల విద్యార్థులు (9 – 12 తరగతులు): కుటుంబ వార్షిక ఆదాయం రూ. 3 లక్షలకు మించకూడదు.
-
ఉన్నత విద్య (UG/PG/IIT/IIM/Medical/Overseas): కుటుంబ వార్షిక ఆదాయం రూ. 6 లక్షలకు మించకూడదు.
-
-
బ్యాంక్ ఖాతా: విద్యార్థి పేరిట లేదా మైనర్ అయితే తల్లిదండ్రుల పేరిట చెల్లుబాటు అయ్యే SBI బ్యాంక్ ఖాతా (SBI Bank Account) తప్పనిసరి.
-
రిజర్వేషన్లు: మొత్తం స్కాలర్‌షిప్‌లలో 50% సీట్లు మహిళా విద్యార్థులకు, 50% సీట్లు SC/ST కేటగిరీ విద్యార్థులకు కేటాయించబడతాయి.
గురుకుల (రెసిడెన్షియల్) పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక వివరాలు:
గురుకుల స్కూళ్లలో (TSWREIS, TTWREIS, MJPTBCWREIS, APREIS మొదలైనవి) చదివే విద్యార్థులు కూడా ఈ స్కాలర్‌షిప్‌కు పూర్తిగా అర్హులు.
-
ఉచిత విద్య & ఫీజు రసీదు మినహాయింపు: గురుకులాల్లో ఉచితంగా చదువుకునేందు వల్ల విద్యార్థులకు సాధారణ ఫీజు రసీదులు (Fee Receipts) ఉండవు. దీనికి ప్రత్యామ్నాయంగా పాఠశాల ప్రిన్సిపాల్ సంతకం చేసిన బోనాఫైడ్ సర్టిఫికేట్ (Bonafide Certificate) లేదా అఫీషియల్ స్టడీ సర్టిఫికేట్ సమర్పిస్తే సరిపోతుంది.
-
ఆదాయ ధృవీకరణ: తహశీల్దార్/MRO జారీ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రం (Income Certificate) రూ. 3 లక్షల లోపు ఉండాలి.
-
మార్కులు: గత సంవత్సరంలో సాధించిన 75% మార్కుల మెమో (SC/ST లకైతే 67.5%) అప్‌లోడ్ చేయాలి.
కావలసిన పత్రాలు (Required Documents):
-
మునుపటి సంవత్సరం మార్కుల మెమో (Marksheet)
-
ప్రభుత్వ గుర్తింపు కార్డు (ఆధార్ కార్డ్)
-
ప్రస్తుత విద్యా సంవత్సరం ఫీజు రసీదు / గురుకుల విద్యార్థులైతే బోనాఫైడ్ సర్టిఫికేట్ / ID కార్డ్
-
కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం (Income Certificate)
-
దరఖాస్తుదారుని పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
-
విద్యార్థి / తల్లిదండ్రుల SBI బ్యాంక్ పాస్‌బుక్ వివరాలు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానం (Step-by-Step Application Process):
-
అధికారిక పోర్టల్ సందర్శించండి: SBI Asha Scholarship అధికారిక వెబ్‌సైట్ (sbiashascholarship.co.in) లేదా Buddy4Study పోర్టల్‌లోకి వెళ్లాలి.
-
రిజిస్ట్రేషన్ & లాగిన్: మీ మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీ లేదా గూగుల్ అకౌంట్‌తో నమోదు (Register) చేసుకుని లాగిన్ అవ్వండి.
-
కేటగిరీ ఎంపిక: మీరు చదువుతున్న కోర్సు (School / UG / PG / IIT / IIM / Medical) కేటగిరీని ఎంచుకుని ‘Apply Now’ పై క్లిక్ చేయండి.
-
వివరాల నమోదు: వ్యక్తిగత వివరాలు, విద్యా సంబంధిత వివరాలు (Academic Marks), చిరునామా, బ్యాంక్ ఖాతా వివరాలను సరిగ్గా నమోదు చేయండి.
-
డాక్యుమెంట్ల అప్‌లోడ్: కోరిన సర్టిఫికేట్లను (ఆధార్, మార్క్స్ షీట్, ఇన్కమ్ సర్టిఫికేట్, బోనాఫైడ్ సర్టిఫికేట్, బ్యాంక్ పాస్‌బుక్) స్పష్టమైన PDF లేదా JPG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయండి.
-
సబ్‌మిషన్ (Submit): వివరాలన్నీ సరి చూసుకుని అప్లికేషన్ ఫారమ్‌ను సమర్పించండి (Submit).
ఎంపిక విధానం (Selection Process):
అభ్యర్థుల అకడమిక్ మెరిట్ (మార్కులు), కుటుంబ ఆర్థిక స్థితి ఆధారంగా ప్రాథమిక షార్ట్‌లిస్టింగ్ జరుగుతుంది. అనంతరం టెలిఫోనిక్ ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తయ్యాక స్కాలర్‌షిప్ మొత్తాన్ని నేరుగా అభ్యర్థి SBI బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు.
Also Read: Hair Dyeing: జుట్టుకు కలర్ వేసే ముందు, ఆ తర్వాత.. ఇవి తెలుసుకోండి!
