Karimnagar: కరీంనగర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇటీవల ఆయన భార్య దివ్య మృతి చెందడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇల్లందకుంట మండలం సీతంపేటకు చెందిన దివ్య (30)కు 2016లో దేసు చంద్రశేఖర్‌తో వివాహం జరిగింది. ప్రస్తుతం ఈ దంపతులు కరీంనగర్‌లోని హనుమాన్‌నగర్‌లో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. చంద్రశేఖర్ టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు.
కొద్దిరోజులుగా దివ్య కడుపునొప్పితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల 18న ఉదయం, ఆమె గన్నేరుపూలు మరియు ఆకులు మిక్సీ చేసి తాగింది. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలిపింది. వెంటనే స్పందించిన చంద్రశేఖర్ ఆమెను హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ దివ్య మృతి చెందింది.
భార్య మృతితో తీవ్ర ఆవేదనకు గురైన చంద్రశేఖర్, ఇల్లందకుంట మండలం సీతంపేటలోని తన అత్తగారింట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Also Read: Hyderabad: కుళ్లిన గుడ్లు, కల్తీ నూనె.. ఈ వార్త చదివితే సమోసా మళ్లీ తినరు
Karimnagar: మొన్న భార్య.. ఇప్పుడు భర్త.. ఎస్సైఆత్మహత్య
