Kidney Health: టమాటాలు ఎక్కువ తింటే.. కిడ్నీలో రాళ్లొస్తాయా..?

Tomatoes Cause Kidney Stones: Myth Or Fact?

Tomatoes Cause Kidney Stones: Myth Or Fact?

Kidney Health: టమాటాలు మన రోజువారీ ఆహారంలో ముఖ్యమైన భాగం. దాదాపు ప్రతి వంటలో ఇవి ఉపయోగిస్తాం. అందుబాటు ధరల్లో లభించడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఇవి ఎక్కువగా వాడుతారు. టమాటా రుచికరంగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి కూడా మంచిదని చెబుతారు. అయితే, దీనికి ఉన్న లాభాలే కాకుండా కొన్ని జాగ్రత్తలు కూడా అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

టమాటాల్లో విటమిన్ C, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే క్యాన్సర్ కణాల అభివృద్ధిని అడ్డుకునే లక్షణాలు కూడా ఇందులో ఉన్నాయని చెబుతారు. టమాటాలోని విటమిన్ K, ఫోలేట్, ఫైబర్ ఎముకల బలాన్ని పెంచడంలో, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో, జీర్ణశక్తి మెరుగుపరచడంలో సహకరిస్తాయి.

అయితే టమాటాల్లో ఆక్సలేట్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని కాల్షియంతో కలిసి స్ఫటికాలుగా మారి, క్రమంగా కిడ్నీలో రాళ్లుగా ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పటికే మూత్రపిండ సమస్యలు ఉన్నవారు ఎక్కువగా టమాటాలు తీసుకుంటే పరిస్థితి మరింత విషమించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అందుకే కిడ్నీ సమస్యలు ఉన్నవారు పచ్చి టమాటాలను తినడం తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం మంచిదని సూచిస్తున్నారు. ఇతరులకు పెద్దగా సమస్యలేమీ లేకపోయినా, టమాటాలను పరిమితంగా తీసుకోవడం మంచిది. రోజూ ఎక్కువ మోతాదులో తినడం కంటే సమతుల ఆహారంలో భాగంగా తీసుకోవాలి.

టమాటాలు బీపీ, కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయని చెప్పినా, వాటిని అధికంగా తీసుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా టమాటా ప్యూరీ, సాస్ వంటి ప్రాసెస్డ్ రూపాల్లో తరచుగా ఉపయోగించే వారు మరింత జాగ్రత్తగా ఉండాలి.

కాబట్టి టమాటాలు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ, మితంగా తీసుకోవడం, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవడం అవసరం.

Also Read: Betel Leaf: మీ ఇంట్లో తమలపాకు మొక్క పెంచుతున్నారా..?

Kidney Health: టమాటాలు ఎక్కువ తింటే.. కిడ్నీలో రాళ్లొస్తాయా..?