Lifestyle: ఉదయాన్నే టీ, కాఫీకి బదులుగా గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగడం ఆరోగ్యానికి మంచిదని చాలామంది భావిస్తారు. అయితే ఆయుర్వేదం ప్రకారం ఈ కలయిక అందరికీ అనుకూలం కాదని చెబుతున్నారు. ముఖ్యంగా వేడి నీటిలో తేనె కలపడం వల్ల దాని గుణాలు తగ్గిపోతాయని, శరీరంలో జీర్ణం కాని పదార్థాలు (టాక్సిన్స్) ఏర్పడే అవకాశముందని నిపుణులు సూచిస్తున్నారు.
తేనెను 40 డిగ్రీల కంటే ఎక్కువ వేడిలో కలిపితే అది తన సహజ శక్తిని కోల్పోయి కఫ లక్షణాలు పెంచేలా మారుతుంది. మరోవైపు నిమ్మలోని పుల్లదనం, తేనె తీపి కలిసి పిత్త దోషాన్ని పెంచే అవకాశం ఉంది. ఈ రెండు పదార్థాలను ఒకేసారి జీర్ణం చేయడం శరీరానికి కష్టంగా మారి, ఉబ్బరం, ఆమ్లత్వం వంటి సమస్యలకు దారితీస్తుంది.
ఈ డ్రింక్‌ను తీసుకున్నప్పుడు వ్యక్తిగత శరీర తత్వాన్ని బట్టి సమస్యలు కనిపించవచ్చు. వాత దోషం ఉన్నవారికి చలి, పొడిబారడం, గ్యాస్, మలబద్ధకం రావచ్చు. పిత్త దోషం ఉన్నవారికి శరీరంలో వేడి పెరిగి ఆమ్లత్వం, మంట, చర్మ సమస్యలు రావచ్చు. కఫ దోషం ఉన్నవారిలో జీర్ణక్రియ మందగించడం, నీరు నిల్వ ఉండటం వంటి ఇబ్బందులు కనిపించవచ్చు.
అందువల్ల, ప్రతి ఒక్కరూ తమ శరీర తత్వానికి అనుగుణంగా పానీయాలను ఎంపిక చేసుకోవడం మంచిది. ఉదాహరణకు:
- వాత దోషం ఉన్నవారు: గోరువెచ్చని నీటిలో అల్లం తురుము, చిటికెడు యాలకులు, కొద్దిగా తేనె (నీరు గోరువెచ్చగా ఉన్నప్పుడే) కలిపి తీసుకోవచ్చు.
- పిత్త దోషం ఉన్నవారు: గోరువెచ్చని నీటిలో పుదీనా ఆకులు, గులాబీ రేకులు, కొద్దిగా మాపుల్ సిరప్ లేదా పంచదార కలపవచ్చు.
- కఫ దోషం ఉన్నవారు: గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, దాల్చిన చెక్క, పసుపు కలిపి తాగవచ్చు.
ఏ పానీయం తీసుకున్నా ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. నీరు ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు అందులో తేనె కలపకూడదు. గోరువెచ్చని స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే తేనెను ఉపయోగించాలి. ఇది కేవలం ఈ డ్రింక్‌కే కాకుండా, అన్ని వేడి పదార్థాలకు వర్తిస్తుంది.
ఇవి కాకుండా, ఉదయాన్నే నిమ్మ-తేనె నీటికి బదులుగా గోరువెచ్చని నీటిలో జీలకర్ర, వాము కలిపి తాగడం లేదా కేవలం గోరువెచ్చని నీటిని తాగడం కూడా మంచిదే. అయితే ఏది మీకు సరిపోతుందో చూసుకుని మాత్రమే అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి శరీర స్వభావం వేర్వేరుగా ఉంటుంది.
గమనిక: ఇది సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా ఆరోగ్య సంబంధిత మార్పులు చేసేముందు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. ఈ సమాచారం ఖచ్చితత్వం లేదా ఫలితాలపై పూర్తి హామీ ఇవ్వబడదు.
Also Read: Hyderabad Metro: గుడ్ న్యూస్.. ఇకనుంచి 4 నిమిషాలకో మెట్రో
Lifestyle: నీటిలో నిమ్మరసం, ఉప్పు, తేనె కలిపి తాగితే..
