Stretch Marks: డెలివరీ తర్వాత వచ్చే స్ట్రెచ్ మార్క్స్ తొలగింపుకు ఈజీ టిప్స్

Home Remedies to Naturally Reduce Stretch Marks

Home Remedies to Naturally Reduce Stretch Marks

Stretch Marks: ప్రెగ్నెన్సీ తర్వాత మహిళల శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. హార్మోన్ అసమతుల్యత, నడుము నొప్పి, నీరసం, బరువు పెరగడం లేదా తగ్గడం వంటి సమస్యలు సాధారణం. సరైన ఆహారం, వ్యాయామం, వైద్యుల సూచనలతో ఇవి చాలా వరకు నియంత్రించవచ్చు. అయితే డెలివరీ అనంతరం పొట్టపై వచ్చే స్ట్రెచ్ మార్క్స్ మాత్రం సులభంగా తగ్గవు. కొన్ని సందర్భాల్లో ఇవి ఏళ్ల పాటు అలాగే కనిపిస్తాయి.

స్ట్రెచ్ మార్క్స్ మహిళల్లో ఎక్కువగా గర్భధారణ తర్వాత కనిపిస్తాయి. అయితే పురుషుల్లో కూడా ఒక్కసారిగా బరువు పెరగడం లేదా తగ్గడం వల్ల ఇవి రావచ్చు. వీటిని “టైగర్ స్ట్రైప్స్” లేదా “స్ట్రైప్స్ ఆఫ్ హానర్” అని కూడా అంటారు. ప్రస్తుతం మార్కెట్‌లో అనేక క్రీములు, జెల్స్ అందుబాటులో ఉన్నా, ప్రతి ఒక్కరికి అవి సరిపోవు. కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చు. అందుకే సహజమైన ఇంటి చిట్కాలు ఉపయోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

అలోవెరా:
అలోవెరాలో విటమిన్ A, C, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా ఉంచి డెడ్ సెల్స్ తొలగించడంలో సహాయపడతాయి. అలోవెరా జెల్‌కు కొబ్బరి నూనె లేదా బాదం నూనె కలిపి స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. వారానికి 3–4 సార్లు ఇలా చేస్తే క్రమంగా మార్క్స్ తగ్గే అవకాశం ఉంటుంది.

కొబ్బరి నూనె మరియు బాదం నూనె:
ఈ నూనెల్లో సహజమైన మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి. చర్మంలో తేమ నిల్వ ఉండేలా చేసి ముడతలు తగ్గించడంలో సహాయపడతాయి. స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రదేశంలో రోజుకు 2–3 సార్లు రెండు మూడు నిమిషాలు మర్దన చేయాలి. క్రమం తప్పకుండా వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది.

చక్కెర స్క్రబ్:
చక్కెర సహజ స్క్రబ్‌లా పనిచేస్తుంది. డెడ్ స్కిన్ తొలగించి రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. కొబ్బరి నూనెలో కొద్దిగా చక్కెర కలిపి స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట మృదువుగా రుద్దాలి. కొన్ని నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. దీన్ని వారానికి కొన్ని సార్లు చేయవచ్చు.

నిమ్మరసం:
నిమ్మరసంలో విటమిన్ C అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. నేరుగా నిమ్మరసాన్ని అప్లై చేయవచ్చు లేదా కీరదోస గుజ్జుతో కలిపి మాస్క్‌లా వాడవచ్చు. అలాగే ఎగ్ వైట్‌లో ఉన్న అమినో ఆమ్లాలు చర్మానికి హైడ్రేషన్ ఇస్తాయి. ఎగ్ వైట్‌ను కూడా స్ట్రెచ్ మార్క్స్‌పై అప్లై చేయవచ్చు.

Also Read: Indian Railway: రైల్వే టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చొచ్చు!

Stretch Marks: డెలివరీ తర్వాత వచ్చే స్ట్రెచ్ మార్క్స్ తొలగింపుకు ఈజీ టిప్స్