Hand Mudras: భారతీయ సాంప్రదాయ యోగశాస్త్రంలో ‘హస్త ముద్రలు’ (Hand Mudras) అత్యంత ప్రాచీనమైనవే కాకుండా శక్తివంతమైన సాధనాలు కూడా. మన ఐదు వేళ్లు పంచభూతాలకు (అగ్ని, వాయువు, ఆకాశం, పృథ్వి, జలం) ప్రతీకలు. వేళ్లను ప్రత్యేక పద్ధతిలో కలపడం ద్వారా శరీరంలో ప్రవహించే శక్తి (Energy flow) క్రమబద్ధీకరించబడుతుంది.
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో సరైన జీవన శైలి అలవాట్లు లేక అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. అధిక రక్తపోటు (BP), మానసిక ఒత్తిడి/డిప్రెషన్ (Depression), మధుమేహం, గుండె జబ్బులు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిని నివారించడానికి, నియంత్రించకుండా మీ రోజువారీ జీవితంలో 5 నుండి 15 నిమిషాలు కేటాయిస్తే చాలు. ముద్ర సాధన(Hand Mudras)తో అదుపులో ఉంచుకోవచ్చని యోగా నిపుణులు సైతం చెబుతున్నారు.
1. బిపి (హై బ్లడ్ ప్రెజర్) తగ్గించే ముద్రలు
ఏ) అపాన వాయు ముద్ర (Apana Vayu Mudra / హృదయ ముద్ర):
-
చేసే విధానం: చూపుడు వేలుని బొటనవేలు మూలంలో (కింద) ఉంచాలి. నడుము వేలు మరియు ఉంగరం వేలు కొనలను బొటనవేలి కొనతో కలపాలి. చిటికెన వేలును నిటారుగా ఉంచాలి.
-
ప్రయోజనం: దీన్ని ‘అత్యవసర ముద్ర’ అని కూడా అంటారు. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రక్తప్రసరణను క్రమబద్ధీకరించి, అధిక రక్తపోటును తగ్గించడంలో సాయపడుతుంది.
బి) ప్రాణ ముద్ర (Prana Mudra):
-
చేసే విధానం: ఉంగరం వేలు, చిటికెన వేలు కొనలను బొటనవేలి కొనతో కలపాలి. మిగిలిన రెండు వేళ్లను నిటారుగా ఉంచాలి.
-
ప్రయోజనం: శరీరంలో ప్రాణశక్తిని పెంచి, నరాల బలహీనతను తగ్గిస్తుంది. రక్తనాళాల్లో ఒత్తిడిని తగ్గించి బిపిని కంట్రోల్ చేస్తుంది.

2. డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి తగ్గించే ముద్రలు
ఏ) జ్ఞాన ముద్ర (Gyan Mudra):
-
చేసే విధానం: చూపుడు వేలి కొనను బొటనవేలి కొనతో తాకించాలి. మిగిలిన మూడు వేళ్లను నిటారుగా ఉంచాలి.
-
ప్రయోజనం: ఇది మెదడులోని నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. ఏకాగ్రతను పెంచి, డిప్రెషన్, ఆందోళన (Anxiety), అనవసర ఆలోచనల నుండి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.
బి) శూన్య ముద్ర (Shunya Mudra):
-
చేసే విధానం: నడుము వేలిని బొటనవేలి మూలంలో ఉంచి, బొటనవేలితో స్వల్పంగా నొక్కాలి.
-
ప్రయోజనం: ఇది మానసిక అలసటను తగ్గించి, మనస్సుకు స్థిరత్వాన్ని ఇస్తుంది.
నిజంగానే 5 నిమిషాల సాధనతో ఫలితం ఉంటుందా?
-
శాస్త్రీయ కోణం: వేళ్ల కొనల్లో అనేక న్యూరాన్లు (Nerve endings) ఉంటాయి. ముద్రలు వేసినప్పుడు నాడీ వ్యవస్థ ఉత్తేజితమై మెదడుకు ప్రశాంతతనిచ్చే సంకేతాలు వెళ్తాయి.
-
కనీస సమయం: రోజుకు కనీసం 5 నుండి 10 నిమిషాలతో ప్రారంభించి, క్రమంగా 15–20 నిమిషాల వరకు పెంచడం వల్ల ఉత్తమ ఫలితాలు కనిపిస్తాయి. ప్రశాంతమైన స్థలంలో కూర్చుని నిటారుగా వెన్నుముక ఉంచి సాధన చేయాలి.
ముఖ్య గమనిక: ముద్రలు అనేవి ఆరోగ్యకరమైన జీవనశైలికి తోడ్పడే అనుబంధ సాధనాలు మాత్రమే. వైద్యులు సూచించిన మందులను ఆపకూడదు. తీవ్రమైన బిపి లేదా డిప్రెషన్ సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాతో పాటు వీటిని సాధన చేయడం శ్రేయస్కరం.
Also Read: Business with Rs.100: బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా.. జస్ట్ రూ.100 చాలు
