Business with Rs.100: బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా.. జస్ట్ రూ.100 చాలు

Business with Rs.100.. Is it Possible..?

Business with Rs.100: ప్రైవేటు ఉద్యోగం చేసి అలసిపోయారా.. బిజినెస్ చేయడం మీ డ్రీమా.. సొంతంగా ఏదైనా వ్యాపారం పెట్టాలనుకుంటున్నారా.. సొంత ఆదాయంతో ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఉందా.. అయితే అస్సలు లేట్ చేయొద్దు. “వ్యాపారం చేయాలంటే లక్షల్లో పెట్టుబడి ఉండాలి” అనేది పాత మాటను మూట కట్టి పక్కన పడేయండి. పెట్టుబడి కంటే ముఖ్యంగా ‘నైపుణ్యం (Skill)’,’ఆలోచన (Idea)’. ఇవి ఉంటే చాలు వ్యాపారం చేయాలన్న మీ ఆలోచనకు ముందడుగు పడ్డట్టే. అయినప్పటికీ పెట్టుబడి విషయంలో సంకోచిస్తున్నారా.. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం మీ వల్ల కాదా.. అయితే కేవలం రూ. 100 తోనే బిజినెస్(Business with Rs.100) స్టార్ట్ చేయొచ్చు.

ఏంటీ కేవలం రూ.100తో బిజినెస్ ఏంటీ అనుకుంటున్నారా.. అవును మీరు విన్నది నిజమే. ఇది నిజంగా సాధ్యమే. అంటే జస్ట్ 100 ఉంటే మీ ఆలోచనను ముందుకు తీసుకెళ్లొచ్చు. ఈ రూ.100 కూడా మీకు అయ్యే ఇంటర్నెట్/ఫోన్ రీఛార్జ్ ఖర్చు మాత్రమే. శ్రమ, ఐడియా మీది అయితే, రూ. 100 పెట్టుబడితో ప్రారంభించగల అత్యుత్తమ బిజినెస్ ఐడియాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం:

Is It Possible To Start An Online Business With Only ₹100 ?

1. డిజిటల్ సర్వీసెస్ & ఫ్రీలాన్సింగ్ (Digital Services)

  • మీ వద్ద స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ గానీ ఉన్నాయా.. అయితే రూపాయి కూడా ఖర్చు లేకుండానే మీ సర్వీసులను అమ్మవచ్చు.
  • కంటెంట్ రైటింగ్ / రీరైటింగ్: మీకు భాషపై పట్టు ఉంటే ఆర్టికల్స్, సోషల్ మీడియా పోస్టులు రాసి ఇవ్వొచ్చు.
  • గ్రాఫిక్ డిజైనింగ్ (Canva): ‘Canva’ వంటి ఉచిత యాప్‌లను ఉపయోగించి ఇన్స్టాగ్రామ్ రీల్స్, బ్యానర్లు, విజిటింగ్ కార్డులు డిజైన్ చేసి చిన్న వ్యాపారులకు అందించవచ్చు.
  • డేటా ఎంట్రీ & అనువాదం (Translation): తెలుగు నుండి ఇంగ్లీష్ లేదా ఇతర భాషలకు ట్రాన్స్‌లేషన్ సేవలు అందించవచ్చు.

2. హోమ్‌మేడ్ ఫుడ్ / డోర్ డెలివరీ (Home-made Snacks)

  • మీకు బాగా వంట వచ్చా.. అయితే అదే మీ వ్యాపారానికి అసలైన పెట్టుబడి. లేదంటే రుచికరమైన స్నాక్స్ చేయగలరు అంటే ఈ వ్యాపారం మీకు బాగా సరిపోతుంది:
  • రూ. 100 తో మైదా, నూనె లేదా పదార్థాలు కొని అప్పటికప్పుడు వేడి వేడిగా సమోసాలు, మురుకులు లేదా పిండివంటలు తయారు చేయవచ్చు.
  • మీ చుట్టుపక్కల ఉండే ఆఫీసులు, షాపుల వారికి శాంపిల్స్ ఇచ్చి ఆర్డర్లు తీసుకోవచ్చు. వచ్చే లాభంతో వ్యాపారాన్ని రోజురోజుకూ పెంచుకోవచ్చు.

3. రీసెల్లింగ్ అండ్ డ్రాప్‌షిప్పింగ్ (Reselling Business)

  • మీకు ఎలాంటి పనులూ రాకపోయినా.. మీరు ఎలాంటి ప్రొడక్ట్స్ స్వయంగా తయారు చేయడం కూడా రాకపోయినా వ్యాపారం చేయొచ్చు.
  • Meesho, GlowRoad వంటి యాప్‌లలో ఉచితంగా రీసెలర్‌గా రిజిస్టర్ అవ్వవచ్చు.
  • అందులో ఉండే బట్టలు, ఎలక్ట్రానిక్స్ లేదా హోమ్ డెకార్ వస్తువుల ఫోటోలను WhatsApp/Instagram గ్రూపుల్లో షేర్ చేసి, మీ మార్జిన్ (లాభం) జోడించి కస్టమర్లకు విక్రయించవచ్చు. మీకు కావాల్సిందల్లా కేవలం ఇంటర్నెట్ డేటా మాత్రమే!

Are you unknowingly committing these costly investment mistakes? | Business  News - The Indian Express

4. ట్యూషన్లు & ఆన్‌లైన్ క్లాసులు (Home Tuitions)

  • మీకు ఏదైనా సబ్జెక్ట్ లేదా నైపుణ్యం (ఉదాహరణకు: మ్యాథ్స్, స్పోకెన్ ఇంగ్లీష్, డ్యాన్స్, మ్యూజిక్) బాగా వస్తే:
  • ఒక పాంప్లేట్ ఉచితంగా డిజైన్ చేసి వాట్సాప్ (WhatsApp)లో షేర్ చేయడం ద్వారా ఇంటి వద్దే ట్యూషన్లు ప్రారంభించవచ్చు.
  • దీనికి పెట్టుబడి సున్నా. కానీ మీ ప్రతిభను నమ్ముకుంటే మీకు ప్రతినెలా స్థిరమైన ఆదాయం వస్తుంది.

5. లోకల్ సర్వీస్ ఏజెన్సీ (Mediator/Middleman Business)

మీ పరిధిలోని ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, పెయింటర్లు లేదా డ్రైవర్లను ఒకచోటకు చేర్చి ఒక నెట్‌వర్క్ తయారు చేసుకోండి.

సేవలు కావలసిన వారికి ఈ వర్కర్లను కనెక్ట్ చేస్తూ రెండింటి మధ్య కమిషన్ పొందవచ్చు. దీన్ని ఇప్పుడు ‘అర్బన్ కంపెనీ’ మోడల్ అంటారు. దీన్ని మీరు లోకల్ స్థాయిలో చిన్నగా మొదలుపెట్టవచ్చు.

రూ. 100 బిజినెస్‌లో సక్సెస్ అవ్వడానికి 3 కీలక సూత్రాలు:

కస్టమర్ నమ్మకం: రూపాయి వ్యాపారమైనా, లక్ష రూపాయల వ్యాపారమైనా క్వాలిటీ, కస్టమర్ సంతృప్తి అత్యంత ముఖ్యం.

సోషల్ మీడియా వాడకం: WhatsApp, Instagram, Facebook పేజీల ద్వారా మీ సేవలను ఉచితంగా ప్రచారం చేసుకోండి.

రీ-ఇన్వెస్ట్‌మెంట్ (Re-investment): వచ్చే చిన్న చిన్న లాభాలను సొంత ఖర్చులకు వాడకుండా, వ్యాపారాన్ని విస్తరించడానికి తిరిగి పెట్టుబడిగా పెట్టండి.

వ్యాపారానికి డబ్బు కంటే ముఖ్యమైనది “ధైర్యం, క్రమశిక్షణ, సరైన ప్లానింగ్”. రూ. 100తో చిన్నగా మొదలుపెట్టి, మీ నైపుణ్యాన్ని నమ్ముకుంటే భవిష్యత్తులో దాన్నే ఒక పెద్ద బ్రాండ్‌గా మార్చడం కచ్చితంగా సాధ్యమే!. కావున ఇప్పుడే మీ ఆలోచనను అమల్లో పెట్టే ప్రయత్నం చేయండి.

Also Read: ChatGPT: చాట్‌జీపీటీ (ChatGPT)తో డబ్బు సంపాదించడం ఎలా?