Trisha: విజయ్ తో ప్రేమ రూమర్స్.. త్రిష వీడియో వైరల్

Vijay Divorce: ‘I Will Never Leave You’ Post Linked To Trisha Goes Viral

Vijay Divorce: ‘I Will Never Leave You’ Post Linked To Trisha Goes Viral

Trisha: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఆయన భార్య సంగీత కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. దాదాపు మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న తమ వివాహ బంధాన్ని ఇక కొనసాగించలేనని ఆమె పేర్కొన్నట్లు వార్తలు చెబుతున్నాయి. 2021 నుంచి ఓ నటితో విజయ్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని ఆమె తన పిటిషన్‌లో ఆరోపించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ నటి పేరు మాత్రం పిటిషన్‌లో ఎక్కడా ప్రస్తావించలేదని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో మాత్రం హీరోయిన్ త్రిష పేరు ప్రధానంగా వినిపిస్తోంది. విజయ్-సంగీత విడాకుల విషయం బయటకు వచ్చిన వెంటనే త్రిష కృష్ణన్ పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. గతంలో విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష చేసిన పోస్టులు, వీరిద్దరూ కలిసి విదేశీ పర్యటనలకు వెళ్లిన ఫోటోలు, అలాగే ‘తిరుప్పాచ్చి’, ‘గిల్లి’ వంటి సినిమాల ప్రమోషన్ల సమయంలో విజయ్ త్రిషను “నా లక్కీ చార్మ్” అని పేర్కొన్న వ్యాఖ్యలు మళ్లీ వైరల్ అవుతున్నాయి. దీంతో సంగీత విడాకులు కోరడానికి త్రిషే కారణమన్న ఆరోపణలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ పుకార్లపై విజయ్ గానీ, త్రిష గానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

ఈ నేపథ్యంలో త్రిష గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ వీడియో కూడా మళ్లీ వైరల్ అవుతోంది. ఆ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి మాట్లాడుతూ, “సరైన వ్యక్తి దొరికితేనే పెళ్లి చేసుకుంటాను. సరైన వ్యక్తి దొరకకపోతే పెళ్లి జరగకపోయినా నాకు అభ్యంతరం లేదు” అని ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. పెళ్లి అనేది కేవలం సమాజం కోసం తీసుకునే నిర్ణయం కాదని, జీవితాంతం నమ్మకంగా కలిసి ఉండగలిగే వ్యక్తి దొరికితేనే ఆ నిర్ణయం తీసుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు. అలాగే “పెళ్లి చేసుకుంటే విడాకుల వరకు వెళ్లాలని నేను అనుకోవడం లేదు. అందుకే తొందరపడి నిర్ణయం తీసుకోను” అని కూడా ఆమె పేర్కొన్నారు. ఇష్టం లేని వ్యక్తితో జీవితం గడపడం కంటే వేచి ఉండటం మంచిదన్న ఆమె భావనను కొందరు సమర్థిస్తుంటే, మరికొందరు విమర్శిస్తున్నారు.

త్రిష వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే, 2015లో చెన్నై వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో ఆమె నిశ్చితార్థం జరిగింది. కానీ కొన్ని నెలల్లోనే అది రద్దయింది. ఆ సమయంలో సినిమాల్లో నటన కొనసాగించాలన్న విషయంలో విభేదాలు వచ్చినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ ఎంగేజ్‌మెంట్ రద్దు విషయాన్ని కూడా కొందరు సోషల్ మీడియాలో మళ్లీ ప్రస్తావిస్తున్నారు.

మొత్తానికి, విజయ్-సంగీత విడాకుల వ్యవహారం, త్రిష పేరుతో వస్తున్న ఊహాగానాలన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే అధికారికంగా ఎవరూ స్పష్టత ఇవ్వలేదు. ఈ వివాదం ఎటు దారి తీస్తుందో చూడాల్సి ఉంది.

Also Read: Thalapathy Vijay: ఓ పక్క భార్య విడాకులు.. విజయ్ కి మరో షాకిచ్చిన కొడుకు

Trisha: విజయ్ తో ప్రేమ రూమర్స్.. త్రిష వీడియో వైరల్