Rashmika Mandanna and Vijay Deverakonda’s wedding pic DETHRONES Virat Kohli’s World Cup pic as MOST LIKED Instagram post in Asia
Virosh Wedding: ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ కోహ్లీ ఫాలోయింగ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆయన చేసిన పోస్ట్‌కు 23 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చి, ఇండియాలో అత్యధిక లైక్స్ సాధించిన పోస్ట్‌గా నిలిచింది. అయితే ఆ రికార్డును తాజాగా విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి పోస్టులు బ్రేక్ చేశాయి.
ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం ఉదయం 10 గంటల 10 నిమిషాలకు విజయ్ దేవరకొండ, రష్మిక మెడలో తాళి కట్టాడు. సాయంత్రం ఇద్దరూ తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసిన పెళ్లి ఫోటోలు కేవలం 30 గంటల్లోనే 23.4 మిలియన్ల లైక్స్ సాధించాయి. దీంతో ఇండియాలో అత్యధిక లైక్స్ సాధించిన ఇన్‌స్టా పోస్ట్‌గా కొత్త రికార్డు సృష్టించింది.
ఇక విజయ్ దేవరకొండ తన అకౌంట్‌లో షేర్ చేసిన పెళ్లి పోస్ట్‌కు 18.6 మిలియన్ల లైక్స్ వచ్చాయి. మొత్తంగా ఈ ఇద్దరి పెళ్లి ఫోటోలకు 42 మిలియన్లకు పైగా లైక్స్ రావడం విశేషం. అంతేకాదు, ఇండియాలో అత్యధిక లైక్స్ సాధించిన పెళ్లి పోస్ట్‌గా కూడా ఇది నిలిచింది. గతంలో కియారా అద్వానీ – సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి ఫోటోలకు 16 మిలియన్లు, రణ్‌బీర్ కపూర్ – ఆలియా భట్ పెళ్లి పోస్టుకు 13 మిలియన్లు లైక్స్ వచ్చాయి. ఇటీవల రెండో వివాహం చేసుకున్న సమంత రూత్ ప్రభు – రాజ్ నిడిమోరు పెళ్లి ఫోటోలకు 12 మిలియన్ల లైక్స్ లభించాయి.
పెళ్లి ఫోటోలతో పాటు విజయ్ దేవరకొండ హృదయానికి హత్తుకునే సందేశం షేర్ చేశాడు. “ఒక రోజు ఆమె నాతో లేకపోతే ఆ రోజు అసంపూర్ణంగా అనిపించేది. ఆమెతో కలిసి భోజనం చేస్తే మరింత రుచిగా ఉండేది. ఆమెతో వర్కౌట్స్ చేస్తే సరదాగా అనిపించేవి. ఆమెతో ఉంటే ఎక్కడ ఉన్నా ఇంట్లో ఉన్నట్టే అనిపించేది. అందుకే నా బెస్ట్ ఫ్రెండ్‌నే నేను భార్యగా చేసుకున్నాను” అని పేర్కొన్నాడు.
రష్మిక కూడా తన పోస్ట్‌లో భావోద్వేగంగా స్పందించింది. “హాయ్ మై లవ్స్, మీకు నా భర్తను పరిచయం చేస్తున్నాను – మిస్టర్ విజయ్ దేవరకొండ. నిజమైన ప్రేమ అంటే ఏమిటో నాకు నేర్పించిన వ్యక్తి. ప్రతీరోజూ పెద్ద కలలు కనాలని, వాటిని సాధించగలనని నమ్మకం కల్పించిన మనిషి. నా జీవితంలో ప్రతి ఆనందం, ప్రతి కష్టం తెలిసిన వ్యక్తి. ఇప్పుడు నేను అతని భార్యగా మారుతున్నాను. ఇది నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు. మనం కలిసి ఉత్తమమైన జీవితాన్ని గడుపుదాం. ఐ లవ్ యూ” అంటూ సుదీర్ఘ సందేశం షేర్ చేసింది.
Virosh Wedding: ఇన్‌స్టా పోస్ట్.. కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన రష్మిక