Kalki 2: ప్రభాస్ ప్రధాన పాత్రలో, దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కల్కి 2898 AD: పార్ట్ 2’ విడుదలపై ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతుండగా, 2027 డిసెంబర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రస్తుతం కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, సాయి పల్లవి పాల్గొంటున్న ముఖ్యమైన షెడ్యూల్స్ 2027 ఏప్రిల్ నాటికి పూర్తయ్యే అవకాశముందని సమాచారం.
మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా మంచి విజయాన్ని అందుకోవడంతో, ఇప్పుడు పార్ట్ 2పై మరింత భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సీక్వెల్‌ను తొలి భాగం కంటే మరింత గ్రాండ్‌గా రూపొందిస్తున్నారని, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ మరియు హై-లెవెల్ గ్రాఫిక్స్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వాలని చిత్రబృందం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
యాక్షన్, విజువల్ స్పెక్టకల్, ఫ్యూచరిస్టిక్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా 2027 చివర్లో భారీ స్థాయిలో విడుదలయ్యే అవకాశం ఉంది.
Also Read: SBI: Q4లో ఎస్బీఐ లాభం రూ.19,684కోట్లు
Kalki 2: కల్కి-2 రిలీజ్ ఎప్పుడంటే?
