Jr NTR: ఒక్క ఫొటోతో సెగలు పుట్టిస్తున్న ఎన్టీఆర్‌

Jr NTR Flaunts His Chiselled Physique As He Preps For Prashanth Neel’s Dragon: ‘Built, Not Bought’

Jr NTR Flaunts His Chiselled Physique As He Preps For Prashanth Neel’s Dragon: ‘Built, Not Bought’

Jr NTR: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన తాజా లుక్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాడు. కండలు తిరిగిన దేహం, ఫిట్ బాడీతో ఆయన పోస్ట్ చేసిన ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. సోమవారం (ఏప్రిల్ 13) ఇన్‌స్టాగ్రామ్‌లో తారక్ షేర్ చేసిన ఈ ఫొటోలో ఆయన వెనుక వైపు నుంచి తన మజిల్స్ చూపిస్తూ కనిపించారు. “ఇది నిర్మించింది… కొన్నది కాదు” అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ పిక్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఈ ఫొటో బయటకు వచ్చిన వెంటనే ఫ్యాన్స్ భారీగా స్పందిస్తున్నారు. “బాడీ బాక్సాఫీస్”, “సునామీ లోడింగ్” అంటూ కామెంట్లు చేస్తూ ఫైర్ ఎమోజీలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నారు.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి “డ్రాగన్” అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమా కోసం తారక్ తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నాడు. బరువు తగ్గి, సన్నగా మారి, గుబురు గడ్డంతో స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ఇప్పుడు మజిల్ బాడీతో సర్‌ప్రైజ్ ఇచ్చాడు.

ఇటీవల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందనే వార్తలు కూడా వినిపించాయి. ఆర్టిస్టుల లుక్స్ సరిగా రాలేదని, కొన్ని సన్నివేశాలు మళ్లీ షూట్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై మూవీ టీమ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇక తారక్ చివరిసారిగా “వార్ 2” సినిమాలో కనిపించాడు. ఈ సినిమాతోనే ఆయన బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా వచ్చిన ఈ చిత్రంలో హృతిక్ రోషన్, కియారా అద్వాణీ కూడా నటించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది.

 

View this post on Instagram

 

A post shared by Jr NTR (@jrntr)

Also Read: KCR: కేసీఆర్‌కు సీతక్క లీగల్‌ నోటీసు

Jr NTR: ఒక్క ఫొటోతో సెగలు పుట్టిస్తున్న ఎన్టీఆర్‌