Maruti Suzuki Dzire: దేశీయ కార్ల మార్కెట్‌లో మారుతీ సుజుకీ ఆధిపత్యం కొనసాగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో (FY26) ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు జరిగిన అమ్మకాల గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ కాలంలో టాప్ 10 అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో మారుతీ సుజుకీకి చెందిన ఆరు మోడళ్లు చోటు దక్కించుకోవడం విశేషం.
ఈ జాబితాలో మారుతీ డిజైర్, ఎర్టిగా, స్విఫ్ట్, బ్రీజా, వ్యాగన్ ఆర్, ఫ్రాంక్స్ మోడళ్లు ఉన్నాయి. ముఖ్యంగా మారుతీ డిజైర్ ఈ ఆర్థిక సంవత్సరంలో టాప్ సెల్లింగ్ కార్‌గా నిలిచింది. ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు మొత్తం 2,07,906 యూనిట్లు అమ్ముడై అత్యధిక సేల్స్ నమోదు చేసిన కారుగా డిజైర్ ముందంజలో ఉంది. మైలేజ్, ధర, మెయింటెనెన్స్ ఖర్చులు తక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల వినియోగదారులు ఈ కారును ఎక్కువగా ఎంచుకుంటున్నారు.
డిజైర్ తర్వాత రెండో స్థానంలో టాటా నెక్సాన్ నిలిచింది. ఈ కాలంలో టాటా నెక్సాన్ 1,96,244 యూనిట్లు అమ్ముడయ్యాయి. సేఫ్టీ ఫీచర్లు, ఎస్యూవీ డిజైన్, పనితీరు కారణంగా నెక్సాన్‌కు కూడా మంచి డిమాండ్ ఉంది.
ఫైనల్ గా చెప్పాలంటే, FY26లో మారుతీ సుజుకీ కార్లు మార్కెట్‌లో బలమైన స్థానం సంపాదించుకున్నాయి. టాప్ 10 జాబితాలో ఆరు మోడళ్లతో కంపెనీ తన డామినేషన్ కొనసాగిస్తోంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వివిధ ధరల శ్రేణిలో కార్లు అందించడం ఈ విజయానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
