Sitting on Floor while Eat: నేలపై కూర్చొని భోజనం చేస్తున్నారా? ఈ ఒక్క అలవాటు చేసుకుంటే చాలంతే!

Sitting on Floor while Eat

Sitting on Floor while Eat: ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది నిలబడి, నడుస్తూ, ఫోన్ చూస్తూ భోజనం చేస్తున్నారు. కానీ మన పెద్దలు “నేలపై కూర్చొని తిను(Sitting on Floor while Eat)” అని ఎందుకు చెప్పేవారో తెలుసా? దాని వెనుక పెద్ద సైన్స్ ఏ ఉంది.

జీర్ణక్రియ బాగా జరుగుతుంది

ప్రశాంతంగా నేలపై కూర్చొని తిన్నప్పుడు శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళ్తుంది. దీంతో జీర్ణరసాలు సరిగ్గా విడుదలై ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. నిలబడి హడావుడిగా తింటే గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం వస్తాయి.

కడుపులో మంట, యాసిడిటీ తగ్గుతుంది

నిటారుగా కూర్చొని తినడం వల్ల కడుపుపై ఒత్తిడి పడదు. వంగి లేదా నిలబడి తింటే యాసిడ్ పైకి వచ్చి గుండెల్లో మంట వస్తుంది.

Sitting in Indian style while eating

బరువు తగ్గడం ఈజీ అవుతుంది

నేలపై కూర్చొని నెమ్మదిగా తింటే మెదడుకు కడుపు నిండిన సంకేతం అందుతుంది. దీంతో ఎక్కువ తినకుండా ఉంటారు. ప్రతి ముద్దను నమిలి తింటే తక్కువ తిన్నా కడుపు నిండిన భావన వస్తుంది.

ఒత్తిడి, మానసిక ఆందోళన తగ్గుతుంది

తింటున్నప్పుడు ఫోన్, టీవీ పక్కన పెట్టి ప్రశాంతంగా తింటే ఒత్తిడి హార్మోన్ తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా ఉండి, ఎక్కువగా తినే అలవాటు కూడా తగ్గుతుంది.

నిపుణులు ఏం చెబుతున్నారు?

రోజులో కనీసం ఒక పూటైనా ఎలాంటి పరధ్యానం లేకుండా నేలపై కూర్చొని భోజనం చేయండి. ఈ చిన్న అలవాటు మీ జీర్ణక్రియను, బరువును, మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

—Also Read:  Loss of Appetite: ఆకలేస్తుంది.. కానీ తినాలనిపించడం లేదా? కారణాలివే!