Expressway Sinks: రూ.4,200 కోట్ల ఎక్స్‌ప్రెస్‌వేలో షాకింగ్ సీన్.. ఫ్యాన్లతో రిపేర్ పనులు!

'Fans' for repair works on Rs 4,200-crore road

Expressway Sinks: కొత్తగా ఓపెన్ చేసిన కాన్పూర్-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నావ్ దగ్గర ఎంట్రీ పాయింట్ వద్ద బారికేడ్లు పెట్టేశారు. దీంతో టోల్ కట్టి లోపలికి వచ్చిన వాహనాలను రాంగ్ రూట్ లో యూ-టర్న్ తీసుకుని వెళ్లాలని చెబుతున్నారు. ముందే చెప్పకుండా ఫాస్టాగ్ లో డబ్బులు కట్ చేసి, తర్వాత రాంగ్ సైడ్ వెళ్లమంటే ఎలా అంటూ డ్రైవర్లు మండిపడుతున్నారు. దీనివల్ల చలాన్ పడుతుందేమోనని, యాక్సిడెంట్ అవుతుందేమోనని భయపడుతున్నారు.

రోడ్డు కుంగిపోతోంది..

అంతేకాదు, కొత్త రోడ్డు చాలా చోట్ల కుంగిపోయింది. 100 స్పీడ్ లో వెళ్తుంటే కారు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరినట్టు ఉందని ప్రయాణికులు చెబుతున్నారు. అందుకే చాలామంది మళ్లీ పాత హైవే వైపే వెళ్తున్నారు.

NHAI ఏమంది?

విషయం పెద్దది కావడంతో NHAI స్పందించింది. మొత్తం 63 కి.మీ రోడ్డులో కేవలం 5 చోట్ల మాత్రమే సమస్య ఉందని, అది కూడా 1 కి.మీ లోపే అని చెప్పింది. భారీ వర్షాల వల్ల రోడ్డు కింద మట్టి బలహీనపడి కుంగిందని ప్రాథమికంగా గుర్తించామంది.

The Kanpur-Lucknow Expressway was built at a cost of around Rs 4,200 crore and was inaugurated on July 13.

దీనిపై లోతైన విచారణకు IIT ఖరగ్పూర్ టీమ్ ను పిలిపించింది. లేజర్ టెక్నాలజీతో రోడ్డును చెక్ చేస్తున్నారు.

కంపెనీకి భారీ షాక్..

రోడ్డు కట్టిన PNC Infratech కంపెనీకి NHAI షోకాజ్ నోటీసు ఇచ్చింది. రిపేర్ కు అయ్యే రూ. 3 కోట్లు ఆ కంపెనీయే కట్టాలని ఆదేశించింది. అంతేకాదు, బాధ్యులైన ఇంజనీర్లను ఉద్యోగం నుంచి తీసేసి, బ్లాక్ లిస్ట్ లో పెట్టింది.

మరమ్మతులు పూర్తయ్యే వరకు ఈ ఎక్స్‌ప్రెస్‌వేపై టోల్ వసూలు చేయడం పూర్తిగా ఆపేస్తున్నట్లు NHAI ప్రకటించింది. ఆ నష్టాన్ని కూడా PNC కంపెనీ నుంచే వసూలు చేస్తామని తేల్చి చెప్పింది.

Also Read: SSB Jawans: బార్డర్ లో దారుణం.. జవాన్లపై రాళ్ల దాడి