SSB Jawans: బార్డర్ లో దారుణం.. జవాన్లపై రాళ్ల దాడి

SSB Jawans: బీహార్లోని బగాహా దగ్గర ఉన్న సుస్తా ప్రాంతంలో మళ్లీ టెన్షన్ మొదలైంది. భారత్-నేపాల్ సరిహద్దులో గస్తీ కాస్తున్న SSB జవాన్లపై నేపాల్ వైపు నుంచి కొందరు రాళ్లు రువ్వారు.

ఈ ఘటనపై వాల్మీకినగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. SSB 21వ బెటాలియన్ ఇచ్చిన ఫిర్యాదుతో సుమారు 150 నుంచి 200 మంది గుర్తుతెలియని వ్యక్తులపై పోలీసులు FIR పెట్టారు.

Indo-Nepal border uproar Stone pelting on SSB FIR against 200 Nepali people | भारत-नेपाल बॉर्डर पर बवाल, SSB जवानों पर पथराव और लाठी-डंडों से हमला, 200 नेपाली लोगों पर FIR | Hindi

అసలేం జరిగింది?

జులై 31న ఇరు దేశాల అధికారులు సరిహద్దులో ఎలాంటి కొత్త నిర్మాణాలు చేయకూడదని ఒప్పుకున్నారు. కానీ ఆ తర్వాత కూడా భారత్ వైపు మట్టి కట్ట పనులు జరుగుతున్నాయని SSB గుర్తించింది.

దీనిపై SSB డిప్యూటీ కమాండెంట్ విజయ్ కుమార్ బృందం నేపాల్ APF అధికారులతో మాట్లాడుతుండగా, సుస్తా గ్రామం నుంచి 200 మంది వరకు కర్రలు, రాళ్లతో వచ్చి గొడవకు దిగారు.

SSB టీమ్ తిరిగి వెళ్తుండగా వారిపై రాళ్లు వేశారు. అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు.

ప్రస్తుతం అక్కడ భద్రతను పెంచారు. BNS కొత్త సెక్షన్ల కింద కేసు పెట్టి పోలీసులు విచారిస్తున్నారు. సుస్తా ప్రాంతంలో పరిస్థితిని భద్రతా బలగాలు నిశితంగా గమనిస్తున్నాయి( Based on Police Reports).

Also Read: UP Viral: నువ్వు దేవుడివయ్యా.. భార్యకు లవర్‌తో పెళ్లి చేసిన భర్త