Trending: క్రేజీ ఐడియా: ట్రాక్టర్ ట్రాలీని స్విమ్మింగ్ పూల్ చేశాడు

Telangana man turns tractor trolley into swimming pool to beat summer heat

Telangana man turns tractor trolley into swimming pool to beat summer heat

Trending: వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కునవనిపల్లె గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వినూత్న ఆలోచనతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

పిల్లలు వేసవి సెలవుల్లో చల్లగా గడపడానికి ఆయన తన ఇంటి ముందు ఉన్న ట్రాక్టర్ ట్రాలీని తాత్కాలిక స్విమ్మింగ్ పూల్‌గా మార్చారు. ఇందుకోసం ట్రాలీ లోపల పాలిథీన్ షీట్ పరచి, అందులో నీటిని నింపారు. దీంతో గ్రామంలోని పిల్లలు ఎండ వేడిని మరిచి నీటిలో ఆడుకుంటూ ఆనందిస్తున్నారు.

ఈ ఆలోచన వెనుక ఉన్న ఉద్దేశం కూడా ప్రత్యేకమే. పిల్లలు ఈత కొట్టేందుకు లేదా నీటిలో సరదాగా గడపడానికి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉండాలని ఆయన భావించారు. అంతేకాకుండా, ప్రతి మండలంలో కనీసం ఒక స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కోరారు.

తక్కువ ఖర్చుతో, అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించి వేసవి వేడికి ఉపశమనం కల్పించిన ఈ ప్రయత్నం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సృజనాత్మకతకు నిదర్శనంగా నిలిచిన ఈ ఆలోచన పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇదిలా ఉండగా, తెలంగాణ అభివృద్ధి ప్రణాళికా సంఘం గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. నిన్న నల్గొండ జిల్లాలో అత్యధికంగా 43.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Also Read: Life Style: చపాతీ, రైస్ కలిపి తింటున్నారా?

Trending: క్రేజీ ఐడియా: ట్రాక్టర్ ట్రాలీని స్విమ్మింగ్ పూల్ చేశాడు