Raghav Chadha: ఎంపీ రాఘవ్ చడ్డాకు యువతలో మంచి క్రేజ్ ఉంది. రాజ్యసభలో ఆయన మాట్లాడే తీరు, అడిగే ప్రశ్నలు తరచూ నెటిజన్ల ప్రశంసలు అందుకుంటుంటాయి. అయితే ఇటీవల ఆయన ఆమ్ ఆద్మీ పార్టీని విడిచి భాజపాలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
పార్టీ మార్పు ప్రకటించిన తర్వాత అభిమానుల నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఈ నిర్ణయం ప్రకటించిన 24 గంటల్లోనే సోషల్ మీడియాలో ఆయన ఫాలోయింగ్ గణనీయంగా తగ్గింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనకు ముందుగా 14.6 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా, ఒక రోజులోనే ఆ సంఖ్య 13.5 మిలియన్లకు పడిపోయింది.
ఆయన నిర్ణయాన్ని చాలామంది యువత అంగీకరించకపోవడం వల్లే ఈ తగ్గుదల జరిగి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదే విషయంపై ఎన్సీపీ (ఎస్‌పీ) అధికార ప్రతినిధి అనీష్ గవాండే స్పందించారు. “ఇంటర్నెట్ ఒకరిని రాత్రికి రాత్రే హీరోగా మార్చగలదు. అలాగే అదే వేగంతో జీరోగా కూడా మార్చగలదు” అని వ్యాఖ్యానించారు. రాఘవ్ చడ్డా తీసుకున్న నిర్ణయం నచ్చకపోవడం వల్లే దాదాపు 10 లక్షల మంది యువత ఆయనను అన్ఫాలో చేశారని తెలిపారు.
