Ugadi 2026: ఉగాది రోజే అమావాస్య..! పండుగ చేస్కోవాలా.. వద్దా..?

This time Ugadi and Amavasya are on the same day

This time Ugadi and Amavasya are on the same day

Ugadi 2026: మనలో చాలామంది జనవరి 1ను న్యూ ఇయర్‌గా జరుపుకుంటారు. కానీ తెలుగు సంప్రదాయం ప్రకారం నిజమైన కొత్త సంవత్సరం ఉగాది పండుగతోనే ప్రారంభమవుతుంది. ఈ ఏడాది శ్రీ పరభవ నామ సంవత్సరం ప్రారంభం కానుండగా, ఉగాది పండుగ మరో నాలుగు రోజుల్లో రానుంది.

అయితే ఈసారి ఉగాది రోజున అమావాస్య ఘడియలు ఉన్నాయని కొందరు పండితులు చెబుతుండటంతో చాలామందికి ఒక సందేహం కలుగుతోంది. “అమావాస్య రోజున పండుగ జరుపుకోవచ్చా లేదా?” అని భక్తులు ఆలోచిస్తున్నారు.

పండితుల వివరణ ప్రకారం, శ్రీ పరభవ నామ సంవత్సరం ప్రారంభమయ్యే రోజున అమావాస్య ఉండటం వల్ల భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం లాగే చైత్ర శుక్ల పాడ్యమి రోజునే ఉగాది పండుగను సంప్రదాయంగా జరుపుకోవచ్చు అని వారు సూచిస్తున్నారు.

ఈ ఏడాది మార్చి 19 ఉదయం 6 గంటల 52 నిమిషాలకు కొత్త సంవత్సర ప్రారంభ ఘడియలు ఉంటాయని పంచాంగ నిపుణులు చెబుతున్నారు. అదే రోజున అమావాస్య ఉండటం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భక్తులు ఆనందంగా దేవుడికి పూజలు చేసి ఉగాది పండుగను జరుపుకోవచ్చని వారు చెబుతున్నారు.

గమనిక: పై వివరాలు మత విశ్వాసాలు, పండితుల అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడినవి. ఇవి శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారం కావని పాఠకులు గమనించాలి.

Also Read: Artificial Intelligence: ఏఐని ఈ ప్రశ్నలు అడిగారో.. డైరెక్టు జైలుకే..!

Ugadi 2026: ఉగాది రోజే అమావాస్య..! పండుగ చేస్కోవాలా.. వద్దా..?