Whatsapp: రాష్ట్రంలో ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను విద్యార్థులు సులభంగా పొందేలా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వాట్సాప్ ద్వారా కూడా హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు.
హాల్‌టికెట్ పొందాలంటే ముందుగా 8096958096 అనే వాట్సాప్ నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపాలి. ఆ తర్వాత “Welcome MeeSeva” అనే సందేశం వస్తుంది. తదుపరి “SSC Hall Ticket March-2026” అని పంపితే ఒక లింక్ అందుతుంది. ఆ లింక్‌ను ఓపెన్ చేసి జిల్లా, మండలం, పాఠశాల పేరును ఎంచుకోవాలి. తర్వాత విద్యార్థి పేరు మరియు పుట్టిన తేదీ నమోదు చేస్తే హాల్‌టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దానిని డౌన్‌లోడ్ చేసుకుని ఇంటర్నెట్ సెంటర్ లేదా మీ సేవా కేంద్రంలో ప్రింట్ తీసుకోవచ్చు.
ఇదే కాకుండా పాఠశాలల లాగిన్‌లో కూడా హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 5వ తేదీ నుంచి ఆయా పాఠశాలల హెడ్‌మాస్టర్లు లేదా ప్రిన్సిపాళ్ల ద్వారా విద్యార్థులు వాటిని పొందవచ్చు. అలాగే ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పించారు.
ఈసారి హాల్‌టికెట్లపై ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ముద్రించారు. ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే విద్యార్థులు తమ ఇళ్ల నుంచి పరీక్షా కేంద్రం వరకు ఎంత దూరం ఉందో, అక్కడికి వెళ్లడానికి ఎంత సమయం పడుతుందో, పూర్తి చిరునామా వంటి వివరాలను తెలుసుకోవచ్చు.
విద్యార్థులు హాల్‌టికెట్‌లో పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఏవైనా పొరపాట్లు ఉంటే వెంటనే పాఠశాల హెడ్‌మాస్టర్ లేదా ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. దీంతో పరీక్షల సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే సరిచేసుకోవచ్చు.
Also Read: Tollywood: బాలకృష్ణ సినిమాలో విలన్‌గా మంచు మనోజ్?
Whatsapp: వాట్సాప్ నుంచి ‘టెన్త్’ హాల్ టికెట్లు..!
